జన్మించిన స్థలమే బ్రంహ స్థానమా
జీవించిన స్థలమే అమ్మ స్థానమా
ఎదిగిన స్థలమే తండ్రి స్థానమా
ఒదిగిన స్థలమే గురు స్థానమా
ఉదయించిన స్థలమే మహా స్థానమా
అస్తమించిన స్థలమే పర స్థానమా
పరిభ్రమించు ప్రదేశమంతా పరమాత్మ ప్రాంతమా
పరిశోధించు పర్యాయమంతా పరిజ్ఞాన ప్రమాణమా
పరిమళించు పర్యావరణమంతా పత్రహరిత ప్రభావమా
పులకరించు పూర్వాకార్యమంతా పూర్ణచంద్ర ప్రమేయమా || జన్మించిన ||
No comments:
Post a Comment