రూపమేలేని ఆకారముచే ఆకృతినై ఉదయిస్తున్నా
రూపమేలేని ప్రకారముచే ఆకృతినై అస్తమిస్తున్నా
రూపమేలేని స్వీకారముచే ఆకృతినై పరిభ్రమిస్తున్నా
రూపమేలేని ఓంకారముచే ఆకృతినై పరిశోధిస్తున్నా
ఆకార ప్రకారాలు లేని తావి తత్వాలతో నిత్యం ఉదయిస్తున్నా
ఆధార సాధర్మ్యాలు లేని భావ బంధాలతో సర్వం ఉద్భవిస్తున్నా || రూపమేలేని ||
ఆత్మాకృతినై అవతరించిన ఆత్మయే నా రూపం
పూర్వాకృతినై అపూర్వించిన పూర్వమే నా రూపం
పరాకృతినై ఆవహించిన పరమే నా రూపం
జీవాకృతినై ఆలోచించిన జీవమే నా రూపం
శుభాకృతినై ఆశ్రయించిన శుభమే నా రూపం
విద్యాకృతినై ఆచరించిన విద్యయే నా రూపం
దైవాకృతినై అనుభవించిన దైవమే నా రూపం
మర్మాకృతినై అస్తమించిన మర్మమే నా రూపం || రూపమేలేని ||
విశ్వాకృతినై అనుసరించిన విశ్వమే నా రూపం
దివ్యాకృతినై అధిరోహించిన దివ్యమే నా రూపం
ధ్యాసాకృతినై ఆదర్శించిన ధ్యాసయే నా రూపం
ధర్మాకృతినై ఆశీర్వదించిన ధర్మమే నా రూపం
సర్వాకృతినై ఆవిష్కరించిన సర్వమే నా రూపం
సత్యాకృతినై అభ్యుదయంచిన సత్యమే నా రూపం
ధాతాకృతినై అనుగ్రహించిన ధాతయే నా రూపం
మాతాకృతినై అనూహ్యవించిన మాతయే నా రూపం || రూపమేలేని ||
No comments:
Post a Comment