దైవమే నిన్ను పరిశోధించునా
దేహమే నిన్ను పరీక్షించునా
భావమే నిన్ను అన్వేషించునా
భాగ్యమే నిన్ను ఆవహించునా
కాలమే నిన్ను ఆశ్రయించునా
కార్యమే నిన్ను అనుగ్రహించునా
జీవన సిద్ధాంత విధానమే నీ మేధస్సును పరిభ్రమించునా
జీవిత వేదాంత వైఖర్యమే నీ మనస్సును పరిశ్రయించునా || దైవమే ||
ఏ దివ్య జ్ఞానం నీ రూపాన్ని నిర్మాణాకృతం చేయునో
ఏ విద్య గీతం నీ నాదాన్ని సరళీకృతం చేయునో
ఏ భవ్య లోకం నీ స్థానాన్ని కేంద్రీకృతం చేయునో
ఏ నవ్య విశ్వం నీ క్షేత్రాన్ని స్వయంకృతం చేయునో
ఏ రాజ్య ధర్మం నీ తేజాన్ని విశదీకృతం చేయునో
ఏ కార్య మర్మం నీ వేదాన్ని సంధ్యాకృతం చేయునో || దైవమే ||
ఏ సూర్య కాంతం నీ జ్ఞానాన్ని అధిష్ఠాకృతం చేయునో
ఏ శౌర్య శాంతం నీ భావాన్ని మహనీకృతం చేయునో
ఏ సవ్య నాభం నీ తత్వాన్ని సురభీకృతం చేయునో
ఏ కావ్య కాలం నీ బంధాన్ని అమరాకృతం చేయునో
ఏ ధన్య ధూపం నీ ప్రజ్ఞాన్ని విశ్వాకృతం చేయునో
ఏ భాగ్య జీవం నీ స్నేహాన్ని జన్మాకృతం చేయునో || దైవమే ||