హృదయం మధురమైన భావ స్పందనం
హృదయం మాధుర్యమైన తత్త్వ స్పర్శనం
హృదయం మందారమైన జీవ స్రవణం
హృదయం మందిరమైన రూప శ్రావణం
హృదయం మనోహరమైన నాద విశేషణం
హృదయం మహోన్నతమైన వేద విశ్లేషణం || హృదయం ||
హృదయం స్పందించినప్పుడే దేహం ఉద్భవించునా
హృదయం స్పర్శించినప్పుడే ఆత్మం ఉదయించునా
హృదయం అర్పించినప్పుడే దేహం ఆవిర్భవించునా
హృదయం పుష్పించినప్పుడే ఆత్మం ఆశ్రయించునా
హృదయం కరుణించినప్పుడే దేహం ఉత్కృష్టమగునా
హృదయం అరుణించినప్పుడే ఆత్మం ఉత్పన్నమగునా || హృదయం ||
హృదయం పరిశుద్ధమైనప్పుడే దేహం అనుగ్రహించునా
హృదయం పరమాత్మమైనప్పుడే ఆత్మం ఆవిష్కరించునా
హృదయం పరిరక్షించిన్నప్పుడే దేహం మహొత్సవించునా
హృదయం పరితపించిన్నప్పుడే ఆత్మం మహోత్కరించునా
హృదయం అనుభవించినప్పుడే దేహం పురస్కరించునా
హృదయం అనుమతించినప్పుడే ఆత్మం పరిభ్రమించునా || హృదయం ||