Wednesday, April 7, 2021

జై జై జనని జగత్ జనని జై జన్మ భూమి

జై జై జనని జగత్ జనని జై జన్మ భూమి 
జై జై ధరణి జగత్ ధరణి జై జన్మ భూమి 

జై జై శ్రావణి జగత్ శ్రావణి జై జన్మ భూమి
జై జై వాహిని జగత్ వాహిని జై జన్మ భూమి   || జై జై ||
   
జనని ధరణి మహా మంగళ పావని 
శ్రావణి వాహిని మహా మంగళ నందిని 

రోహిణి రుక్మిణి మహా మధుర మోహిని 
చాందిని యామిని మహా మధుర రాగిని 

శివాని భవాని మహా మాణిక్య శోధిని 
అశ్విని శర్వాణి మహా మాణిక్య యోగిని    || జై జై || 

హరిణి శ్రమణి మహా మందార గాయని
రమణి తరుణి మహా మందార భావిని

ఆమని కేశిని మహా మానస దర్శిని 
హర్షిణీ భామిని మహా మానస శోభిని  

జనని ధరణి మహా మన్వంతర సర్వాణీ 
శ్రావణి వాహిని మహా మన్వంతర సాక్షిని   || జై జై ||

No comments:

Post a Comment