Wednesday, April 21, 2021

విశ్వమే అవతరించేనా

విశ్వమే అవతరించేనా 
విశ్వమే అంతరించునా 

జగమే అనుకరించేనా  
జగమే అవరోధించునా  

లోకమే అనుభవించేనా  
లోకమే అనాదరించేనా 

జ్ఞానమే విజ్ఞానించేనా 
జ్ఞానమే అఙ్ఞానించేనా 

ప్రతి జీవిలో ఉద్భవించునది మహోదయమై ఉదయించేనా 
ప్రతి జీవిలో అంతరించునది మహాధ్వంసమై అస్తయించేనా

ప్రతి అణువులో ఆవిర్భవించునది మహోన్నతమై ఉపస్థితించేనా
ప్రతి అణువులో ఉపస్కరించునది మహాక్షయమై అస్వస్థతించేనా     || విశ్వమే || 

No comments:

Post a Comment