పరమేశ్వరా మహదేశ్వరా పరిశోధించరా
పరమాత్మా పరధాత్మా పరిశీలించారా
నా ప్రార్ధనను నీవైనా వినగలవా
నా ప్రార్థనను నీవైనా చూడగలవా
నాకైనా యదార్థ పరమార్థం తెలుపగలవా ప్రాణేశ్వరా || పరమేశ్వరా ||
పురమైనను పర్యావరణం కాలేదా
వృక్షమైనను పత్రహరితం కాలేదా
సూర్యుడైనను ప్రకాశం కాలేదా
తేజమైనను ప్రథమం కాలేదా
క్షేత్రమైనను ప్రసన్నతం కాలేదా
గృహమైనను ప్రస్కందం కాలేదా
దివ్యమైనను ప్రపూరితం కాలేదా
ద్వారమైనను ప్రత్యంతం కాలేదా || పరమేశ్వరా ||
స్థానమైనను పూజ్యతం కాలేదా
ప్రాంతమైనను ప్రభాతం కాలేదా
రూపమైనను ప్రత్యక్షం కాలేదా
వర్ణమైనను ప్రతిబింబం కాలేదా
శ్వాసయైనను ప్రవాహం కాలేదా
నేత్రమైనను ప్రతిరూపం కాలేదా
క్షణమైనను ప్రశాంతం కాలేదా
కాలమైనను పరిష్కారం కాలేదా || పరమేశ్వరా ||
జీవమైనను ప్రియమం కాలేదా
గాలియైనను ప్రసూతం కాలేదా
భక్తియైనను ప్రధానం కాలేదా
యుక్తియైనను ప్రారంభం కాలేదా
జలమైనను పన్నీరం కాలేదా
క్షీరమైనను పరిశుద్ధం కాలేదా
గంధమైనను పరిమళం కాలేదా
వస్త్రమైనను పరిభాషణం కాలేదా || పరమేశ్వరా ||
పత్రమైనను పరిశుభ్రం కాలేదా
పుష్పమైనను పవిత్రతం కాలేదా
ఫలమైనను పరిపూర్ణం కాలేదా
జ్యోతియైనను ప్రజ్వలం కాలేదా
శ్లోకమైనను పరమార్థం కాలేదా
మాటయైనను ప్రకృతం కాలేదా
ధర్మమైనను పాటించడం కాలేదా
దైవమైనను ప్రభవించడం కాలేదా || పరమేశ్వరా ||
' అనంతం పరిశుద్ధమై సమయ స్ఫూర్తితో సమకూర్చేలా ప్రార్ధన పూజ్యోదయం కేంద్రీకృతమై ఆత్మ సంతృప్తిచే సంభవించునా! '
No comments:
Post a Comment