Monday, May 31, 2021

చదవడం చదుకోవడం చదివించడం

చదవడం చదుకోవడం చదివించడం 
చదువుతూ చెప్పడం చదువునే చెప్పించడం  

చదువులే చేయడం చదువుతో చేరడం 
(చదువులా మారడం చదువులై చూడడం)
చదువునే చేయించడం చదువుగా చూడడం 

చదువులు మేధావుల చరిత మనోగతం
చదువులు మహాత్ముల భరిత మనోజవం   || చదవడం || 

చదువులు విశ్వతి రక్షతి విద్యాకరం 
చదువులు ప్రకృతి వుత్పత్తి విద్యాధనం

చదువులు సమయ విజ్ఞాన విద్యాభ్యాసం 
చదువులు సదృశ్య సాంఘిక విద్యావిధానం

చదువులు బోధకుల పాండిత్య గుణ పఠనం 
చదువులు గురువుల సంస్కృతి క్రమ శిక్షణం 

చదువులు సమన్విత సమస్థిత అభివర్తనం 
చదువులు సంభాషిత సుభాషిత అధ్యాయనం    || చదవడం ||

చదువులా చదువుకునే చదువునే చాటించడం 
చదువులు చదవాలని చదువును చెప్పించడం  

చదువుతూ చదువును చదువులతో చేర్చడం 
చదువుతూ చదువులను చదువులకై చెప్పడం 

చదువుకునే చదువును చదువుతో చర్చించడం 
చదువును చదువులకై చదువులతో చేర్పించడం  

చదువుతూ చదువులతో చదువులను చెప్పుకోవడం 
చదువుతూ చదువులతో చదువులను చూపించడం 

చదవాలని చదువులతో చదువులను చూసుకోవడం 
చదవాలని చదువులతో చదువులను చేర్చుకోవడం   

చదువులే చెప్పాలని చదువులను చూపించుకోవడం 
చదువులే చెప్పాలని చదువులను చెప్పించుకోవడం   || చదవడం || 

చదివించే చదువులను చదువులలోనే చెప్పడం 
చదివించే చదువులను చదువులలోనే చేర్చడం 

చదువుకునే చదువులను చదువులతోనే చర్చించడం
చదువుకునే చదువులను చదువులతోనే చేర్పించడం

చదివించే చదువులలో చదువులు చమత్కారం 
చదివించే చదువులలో చదువులు చమత్కృతం 
 
చదువుతూనే చదువులలో చదువులు చాతుర్యం 
చదువుతూనే చదువులలో చదువులు చతురత్వం

చదవాలనే చదువులలో చతుర్వర్ణాల చతుర్వర్గం 
చదవాలనే చదువులలో చతుర్విదాల చతుర్వింశతం 

చదువుల చరణములు చరిత్రకు చరాచరం
చదువుల చరణములు చరిత్రకు చరితార్థం     || చదవడం || 

' తెలుగు భాష సమయోచితం సమర్థం సామరస్యం సంపూర్ణం సంభాషితం సమగ్రతం సాంఘికం సంస్కృతం సాహిత్యం సంస్కారం సాధనం సుధామృతం! '

No comments:

Post a Comment