Friday, May 7, 2021

హృదయంలోన హృదయం ఉదయించే తత్వం మాతృ తత్వమేగా

హృదయంలోన హృదయం ఉదయించే తత్వం మాతృ తత్వమేగా 
దేహంలోన దేహం ఉద్భవించే తత్వం స్త్రీ తత్వమేగా 
      
శ్వాసలోన శ్వాస అవతరించే తత్వం శోభన తత్వమేగా
రూపంలోన రూపం ఆవిర్భవించే తత్వం శ్రీమతి తత్వమేగా 

ఆత్మలోన ఆత్మ అంతర్భవించే తత్వం లలిత తత్వమేగా 
జీవంలోన జీవం అంతర్గర్భవించే తత్వం సుప్రియ తత్వమేగా 

రుధిరంలోన రుధిరం ప్రభవించే తత్వం సుమతి తత్వమేగా 
మనస్సులోన మనస్సు ఆశ్రయించే తత్వం సుగుణ తత్వమేగా 

విశ్వ జగతికే మాతృత్వం అమర భావాల మధురత్వం మగువ నాదాల మనోహరం 
విశ్వ జగతికే మాతృత్వం అమోఘ భావాల సురత్నత్వం చెలువ రాగాల మనోజ్ఞతం  || హృదయంలోన || 

No comments:

Post a Comment