ఏదో ఒకటి ఇచ్చావు ఈశ్వరా! ఏదో ఒకటి తెచ్చావు పరమేశ్వరా!
ఏదో ఒకటి మెచ్చావు ఈశ్వరా! ఏదో ఒకటి నచ్చావు పరమేశ్వరా!
ఎంతవరకు ఇస్తావో తెలియదు ఈశ్వరా! ఎంతవరకు తెస్తావో తెలుపవు పరమేశ్వరా!
ఎంతవరకు మెచ్చావో తెలియదు ఈశ్వరా! ఎంతవరకు నచ్చావో తెలుపవు పరమేశ్వరా!
ఏదో ఒకటి ఇస్తూనే ఏదో ఒకటి తీస్తావు జీవేశ్వరా!
ఏదో ఒకటి తెస్తూనే ఏదో ఒకటి దాస్తావు ప్రాణేశ్వరా!
ఏదో ఒకటి మెచ్చేలా ఏదో ఒకటి చేస్తావు జీవేశ్వరా!
ఏదో ఒకటి నచ్చేలా ఏదో ఒకటి చూస్తావు ప్రాణేశ్వరా! || ఏదో ఒకటి ||
సూర్యోదయంలా అందిస్తావు సూర్యాస్తయంలా శాంతిస్తావు జ్ఞానేశ్వరా!
మహోదయంలా మురిపిస్తావు పూర్వోదయంలా మరిపిస్తావు ధ్యానేశ్వరా!
మధురమై మహోన్నతమౌతావు మాధుర్యమై మహత్యమౌతావు మహదేశ్వరా!
మనోహరమై అపూర్వమౌతావు మనోరంజితమై అనంతమౌతావు అఖిలేశ్వరా! || ఏదో ఒకటి ||
ప్రకృతిలోనే దర్శనమిస్తావు ఆకృతిలోనే అభయమిస్తావు అభయేశ్వరా!
సుకృతిలోనే ఆదర్శమిస్తావు జాగృతిలోనే అనుగ్రహిస్తావు అర్ధనారీశ్వరా!
ఆరోగ్యమై అందరిలో అవతరిస్తావు అనారోగ్యమై అందరిలో అంతరిస్తావు అనంతేశ్వరా!
అద్భుతమై శృంగారిలో అధిరోహిస్తావు ఆశ్చర్యమై శృంగారిలో అవరోహిస్తావు ఆద్యంతేశ్వరా! || ఏదో ఒకటి ||
----- ----- ----- ----- -----
ఏదో ఒకటి ఇచ్చావు ఏదో ఒకటి తెచ్చావు
ఏదో ఒకటి మెచ్చావు ఏదో ఒకటి నచ్చావు
ఎంతవరకు ఇస్తావో తెలియదు ఎంతవరకు తెస్తావో తెలుపవు
ఎంతవరకు మెచ్చావో తెలియదు ఎంతవరకు నచ్చావో తెలుపవు
ఏదో ఒకటి ఇస్తూనే ఏదో ఒకటి తీస్తావు
ఏదో ఒకటి తెస్తూనే ఏదో ఒకటి దాస్తావు
ఏదో ఒకటి మెచ్చేలా ఏదో ఒకటి చేస్తావు
ఏదో ఒకటి నచ్చేలా ఏదో ఒకటి చూస్తావు || ఏదో ఒకటి ||
సూర్యోదయంలా అందిస్తావు సూర్యాస్తయంలా శాంతిస్తావు
మహోదయంలా మురిపిస్తావు పూర్వోదయంలా మరిపిస్తావు
మధురమై మహోన్నతమౌతావు మాధుర్యమై మహత్యమౌతావు
మనోహరమై అపూర్వమౌతావు మనోరంజితమై అనంతమౌతావు || ఏదో ఒకటి ||
ప్రకృతిలోనే దర్శనమిస్తావు ఆకృతిలోనే అభయమిస్తావు
సుకృతిలోనే ఆదర్శమిస్తావు జాగృతిలోనే అనుగ్రహిస్తావు
ఆరోగ్యమై అందరిలో అవతరిస్తావు అనారోగ్యమై అందరిలో అంతరిస్తావు
అద్భుతమై శృంగారిలో అధిరోహిస్తావు ఆశ్చర్యమై శృంగారిలో అవరోహిస్తావు || ఏదో ఒకటి ||
No comments:
Post a Comment