Saturday, May 22, 2021

విశ్వమే కాలమా

విశ్వమే కాలమా 
కాలమే సమయమా 
సమయమే క్షణాలుగా 

క్షణాలే ఆలోచనలుగా 
ఆలోచనలే అవకాశాలుగా 
అవకాశాలే ఆదర్శాలుగా 

ఆదర్శాలే సహనాలుగా 
సహనాలే సాధనాలుగా 
సాధనాలే విజయాలుగా 

విజయాలే లక్ష్యాలుగా 
లక్ష్యాలే లక్షణాలుగా 
లక్షణాలే జీవితాలుగా 

జీవించే జనులలో జనులతో ఐక్యమై సమయాన్ని సామార్థ్యంగా చేసుకో 
జీవించే జీవులలో జీవులతో సౌఖ్యమై సమయాన్ని పరమార్థంగా చేసుకో   || విశ్వమే || 

ఆలోచన అవకాశమై మేధస్సును విజ్ఞానవంతంగా కాలమే మార్చునే 
ప్రలోభన ఆకర్షితమై దేహస్సును విశ్వాసవంతంగా కాలమే మార్చునే 

సూర్యోధన సమయమై మనస్సును ప్రకాశవంతంగా కాలమే మార్చునే 
దివ్యోధన సహకార్యమై వయస్సును ప్రభాతవంతంగా కాలమే మార్చునే   

సులోచన సుభాషితమై అహస్సును ఆనందవంతంగా కాలమే మార్చునే 
సుదర్శన సువర్షితమై ఆయుస్సును అమరవంతంగా కాలమే మార్చునే    || విశ్వమే ||

దశానన అపూర్వమై శిరస్సును విజ్ఞానవంతంగా కాలమే మార్చునే 
ఆదర్శన అఖిలమై తేజస్సును నిర్మలవంతంగా కాలమే మార్చునే   

అవోక్షణ ప్రకృతమై సరస్సును సుందరవంతంగా కాలమే మార్చునే 
అనుక్షణ అనూహ్యమై మిథస్సును వైభవవంతంగా కాలమే మార్చునే  

సనాతన అద్భుతమై వచస్సును ప్రణతివంతంగా కాలమే మార్చునే 
విమోచన అనంతమై పూర్వస్సును పుష్కలవంతంగా కాలమే మార్చునే    || విశ్వమే ||

No comments:

Post a Comment