మానవుల కంటే ఇతర జీవులు ప్రకృతిని ఎక్కువగా పరిశోధిస్తాయి అనుభవిస్తాయి
ఇతర జీవులలో ప్రకృతి సహజత్వంగా పరిశుద్ధమైన ప్రాణవాయువుతో పరిపూర్ణమైన సూర్యరశ్మిని పర్యావరణమైన పత్రహరిత వాతావరణాన్ని అనుభవిస్తున్నాయి
ఇతర జీవులు సహజమైన ప్రకృతి ఆహారాన్ని సేవిస్తూ ప్రకృతిలోనే నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ జీవిత కాలమంతా ఆరోగ్యంతో జీవిస్తాయి
ఇతర జీవులు సహజమైన భావ తత్త్వాలచే ప్రకృతిని గమనిస్తూ జీవితాన్ని తరతరాలుగా సహజంగా సాగిస్తున్నాయి
ఇతర జీవులకు ఎటువంటి ప్రమాదం కలిగినా ఎటువంటి ఔషధాన్ని అందుకోకుండాన్నే సహజంగా నయం అయ్యేలా తమ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి
ఇతర జీవులు ఎదుగుటలో ఎటువంటి సందేహం ఉండదు కలగదు ఎందుకంటే లాభ నష్టాలు ఎక్కువ తక్కువలు [ఒక దాని కంటే మరోకటికి] అశుభ శుభములు పురాతనమైనవి నవీనమైనవి ఏ వస్తువులు ఆభరణాలు ఏవీ ఉండవు [భావ తత్త్వాలు తప్ప ఏవీ ఉండవు - భావ తత్వాలతోనే సహజంగా ఆహారాన్ని సేకరిస్తూ సహజమైన గృహాన్ని ఏర్పాటు చేసుకుంటూ సహజమైన ఆరోగ్యాన్ని అందుకుంటూ సహజంగా ప్రయాణిస్తూ సహజమైన జన్మలను అందిస్తూ సహజంగానే విజ్ఞానం చెందుతూ సహజమైన పరిశోధన చేస్తూ సహజంగానే విశ్వాన్ని తిలకిస్తూ అవగాహనతో సహజంగానే కాలక్షేపం చేస్తూ పర ధ్యాస యోగాసనాలతో తరతరాలుగా సాగిపోతాయి]
మానవుని విచక్షణ కృత్రిమమైన జీవన విధానాన్ని సాగిస్తూ సాధిస్తూ సాధన చేస్తూ జీవితాలను కృత్రిమంగా సాగిస్తున్నారు [ధర లేకుండా పంచభూతాలను కూడా అందుకోలేము]
గాలి [శ్వాస] నీరు [స్వచ్ఛమైన నీరు] భూమి [గృహం] వెలుగు [విద్యుత్తు] ప్రయాణం [వాహనం] విజ్ఞానం [విద్య] పరిశుద్ధత [పరిశుభ్రత] అన్నీ కృత్రిమమైనవి వివిధ రకాల ధరలతో కూడినవి
జన్మించిన క్షణం నుండి మరణించు క్షణం వరకు కృత్రిమంగా జీవిస్తూ ధరలతో అన్నింటిని కొనుక్కోవడం మానవ జీవన విధానం [విజ్ఞాన అభివృద్ధికి మార్గ దర్శకం]
ఇతర జీవులు దినచర్య విధాన్ని సక్రమంగా పాటిస్తాయి [సరైన సమయానికి మేల్కోవడం ఆహారాన్ని సేకరించడం సరైన సమయానికి నిద్రపోవడం] - మానవుల దినచర్య విధానమే సరైన స్థితిలో లేక అనేక విజ్ఞాన ఆరోగ్య ప్రశాంతత సమస్యలు కలుగుతున్నాయి
-- వివరణ ఇంకా ఉంది!