Thursday, April 30, 2015

దేవుడే లేడని అనుకొంటివా!

దేవుడే లేడని అనుకొంటివా!
ఇక మోక్షమేలా ఆపై నీకు స్వర్గమేలా - ఓ మానవా! || దేవుడే లేడని అనుకొంటివా! ||

మనస్సు నీదేగా శ్వాస నీలోనే ధ్యాస నీతోనే
ఇక మేధస్సుతో ఆలోచిస్తే నీకే తెలియునులే
విశ్వ మందు ఏమున్నదో నీకే ఎరుకలే 
భావాలతో ఏకీభవిస్తే అన్నీ నీకే తెలిసేనులే
జగతిని సృష్టించినది మానవుడేనని నీలో సందేహమా 
బ్రమ్హాండాన్ని అమర్చినది మానవులేనని మరో సందేహమా
దేవుడే లేనిదే విత్తనం లేదయ్యా
చెట్టే పెరగనిదే దైవం లేదయ్యా
ఆలోచిస్తే దేవుడు నీలోనే ఉన్నాడు
దైవం కూడా నీలో ఉన్న శక్తి స్వరూపమే || దేవుడే లేడని అనుకొంటివా! ||

మాత్రు భావాలే సృష్టి స్వరూపాలకు నిలయం
విశ్వ భావాలే జగతిలోని బంధాలకు నిదర్శనం
నీవు సృష్టించేది ఏదీ లేదయ్యా
నీకు తెలిసేదే ఎంతో ఉందయ్యా
మేధస్సుతో ఆలోచిస్తే మేధావివి కాలేవు
మనస్సుతో ఆచరిస్తే ముక్తిని పొందలేవు
అనుభవాలతో ఎకీభవిస్తేనే అద్భుతాన్ని చూసెదవు
జీవితాన్ని విజ్ఞానంతో సాగిస్తేనే గమ్యాన్ని చేరెదవు
లోకాలెన్నో చూడాలంటే దైవ శక్తి అవసరమే
దేవుడే ఉన్నాడంటే నీకు జీవ శ్వాస అవసరమే || దేవుడే లేడని అనుకొంటివా! ||

Tuesday, April 21, 2015

ఆగాలని లేదు ఆగినా ఆగి పోవాలని లేదు

ఆగాలని లేదు ఆగినా ఆగి పోవాలని లేదు
ఆగితే సాగాలని ఆగెంత సమయం లేదు


ఆగేలా మరణమైనా లేదు ఆగి పోయేలా విశ్వమైనా లేదు
మరణం నాకు అసలే లేదు విశ్వానికి కాస్తైనా లేనే లేదు


క్షణమైనా ఆగాలని నాలోనే లేదు ఇక విశ్వానికి ఏనాటికి లేదు
ఆగితే నేను నా విశ్వంతోనే ఆగాలని విశ్వమే నాతో ఆగేలా లేదు


నేనే కాలమై విశ్వంలో ఏకమై క్షణాలుగా విడి పోవాలని లేదు
కలిసే విశ్వ కాలమై సాగే సమయమై విడిచి పోవాలని లేదు


విశ్వాన్ని విడిచి పోవాలని లేదు విశ్వమే నన్ను విడవాలని లేదు
విశ్వమే నన్ను విడిచి పోయేంత సందేహము ఏనాటికి లేదు


ఆగిపోయేలా విడిచి పోలేము విడిచి పోయేలా ఆగలేము
ఏనాటికైనా ఆగలేమని ఎక్కడికైనా ఎప్పటికైనా విసిగి పోలేము


ఎవరితోనైనా ఆగలేము ఎంతటి ప్రళయ మైనా ఆగి పోలేము
ఎంతటి భయంకరమైనా ఆగము ఏనాటికైనా ఆగలేము


ఎవరున్నా లేకున్నా అలసట లేక అలాగే సాగి పోయెదము
ఏది ఉన్నా లేకున్నా కనిపిస్తున్నా కనిపించకున్నా సాగెదము


ఎవరు ఆపాలనుకున్నా ఏది ఆపాలనుకున్నా వీలు లేదు
ఎవరు ఉండాలనుకున్నా ఏది ఉండాలనుకున్నా ఎప్పటికీ మాతో సాగేది లేదు

Wednesday, April 15, 2015

విశ్వమా నీవు నా మేధస్సులో లీనమై

విశ్వమా నీవు నా మేధస్సులో లీనమై చేర గలవా
నా మేధస్సులోని ఆలోచనలు నిన్నే కోరుచున్నాయి
విశ్వమున దాగే ప్రతి అద్భుతాన్ని తిలకిస్తున్నాయి
నా యందు నీవు నిశ్చలంగా కాలాన్ని సాగించెదవు

Tuesday, April 14, 2015

విశ్వమా! నా మేధస్సులో లేని ఆలోచనను

విశ్వమా! నా మేధస్సులో లేని ఆలోచనను కలిగించవా
ఆలోచనలు లేక మనస్సు చింతిస్తూ ఏదో అన్వేషిస్తున్నది 
నీలో దాగిన అంతరిక్షపు సమావేశాన్ని అందజేయవా
నేను నీలాగే విశ్వమై అనంత భావాలతో జీవిస్తుంటాను

మేధస్సుతో చేసే అజ్ఞాన కార్యాలు

మేధస్సుతో చేసే అజ్ఞాన కార్యాలు మీ హృదయాన్నే కలచి వేస్తాయి
విజ్ఞానాన్ని ఎసరు పెట్టి అజ్ఞానంగా ఆలోచింప జేస్తున్నారు
మంచి వాళ్ళకు న్యాయం చేయక ఇరుగు పొరుగులకే మీ చూపు
మీ ద్వారా మంచి నశించి పోయి అజ్ఞానం తాండవిస్తుంది
సరైన వారికి సరైన న్యాయం చేసి హృదయాన్ని జీవింప జేయండి

ఏకాంత సమయాన ఏకాగ్రతతో

ఏకాంత సమయాన ఏకాగ్రతతో జీవితాభివృద్ధిని పరిశీలించు
సరి కాని భావ తత్వాలను ఏ బంధాలకు అంటనివ్వకు
విజ్ఞాన పరిశోధకుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించండి
మన జీవితాలను ఓ పురోగతి బాట వైపు నడిపించండి

Thursday, April 9, 2015

నిద్రలేని జీవితాలు మానసిక సామర్థ్యం

నిద్రలేని జీవితాలు మానసిక సామర్థ్యం లేని జీవన శరీరాలు
సరి లేని నిద్ర సిరి లేని సంపద ఆరోగ్యం లేని జీవితాలు ఎన్నో
ఆలోచనలతో శ్రమించినా మేధస్సులో ఉత్తేజ కణాలు తరిగేను
కార్యములలో ఉత్తేజము లేక జీవిత లక్ష్యాలు నెరవలేక పోయేను

Wednesday, April 8, 2015

వెంటాడే సమస్యలు వేదింపులు కోప తాపాలు

వెంటాడే సమస్యలు వేదింపులు కోప తాపాలు బంధాలలో సంభవిస్తూనే ఉంటాయి
లాభ నష్టాలు సుఖ దుఃఖాలు అజ్ఞాన విజ్ఞానాలు అందరిలో కలుగుతూనే ఉంటాయి 
సృష్టి వైపరిత్యాలు సమాజ కలహాలు మనకు ప్రభావం చూపుతూనే ఉంటాయి
ఎవరు ఎంతటి వారైనా విజ్ఞాన అనుభవాలతో శ్రమిస్తూ అన్నింటిని అధిగమించాలి
జీవిత లక్ష్యాన్ని జయించేందుకు సమయోచితంగా ఆలోచిస్తూ నడుచుకోవాలి

Tuesday, April 7, 2015

విశ్వాన్ని కాల్చి బూడిద చేస్తే కర్మ నశించునా

విశ్వాన్ని కాల్చి బూడిద చేస్తే కర్మ నశించునా ఆగ్రహం చల్లారునా 
మనస్సును మాయ చేసి మంత్రాన్ని జపిస్తే మోహం వెళ్లిపోవునా
ఆలోచనలను కట్టేసి మేధస్సును బంధిస్తే కోరికలు ఆగిపోవునా 
తీరలేని సమస్యలు చేయలేని కార్యాలు మనకు ఎందుకని విడిచి పెట్టేదమా!

మేఘాల అంచున సూర్య కిరణాల తేజస్సు

మేఘాల అంచున సూర్య కిరణాల తేజస్సు సువర్ణాన్ని మించి మహా వర్ణాన్ని చూపుతున్నాయి
తల తల మెరిసే సూర్య భింబపు రజతపు కిరణాలు ఆకాశపు అంచులను గుచ్చేస్తున్నాయి 
మేధస్సు లోని కణాలను మెప్పించేలా ఊష్ణ భింబాలు ఆలోచనలను ఆర్భాటం చెందిస్తున్నాయి
సూర్య ఖగోళంలో దాగిన అగ్ని కణాలు విశ్వాంతరాన్ని మెరిసేలా వెలుగును ప్రసాదిస్తున్నాయి

ఏకాగ్రత లేని ఆలోచనను ఎదుటి వారికి

ఏకాగ్రత లేని ఆలోచనను ఎదుటి వారికి తెలియనివ్వకు
ఆవేదనతో దాగిన కోపాన్ని ఇతరులపై చూపనివ్వకు
అర్థం లేని పని తనాన్ని అల్పకులకు అంటనివ్వకు
మానవత్వం లేని సమాజాన్ని వేలెత్తి చాటనివ్వకు

హీనుడైనా ధీనుడైనా మానవ శరీరమే

హీనుడైనా ధీనుడైనా మానవ శరీరమే
పేదవాడైనా రాజైనా మరణించే వాడేలే
రోగి ఐనా ఆరోగ్యుడైనా ఇద్దరిలో రక్తమేలే
లేనివాడైనా ఉన్నవాడైనా మానవుడేలే
హింస వాడైనా హంస వాడైనా శ్వాసించడమే
అజ్ఞాని ఐనా విజ్ఞాని ఐనా జన్మించేవాడేలే
ఆత్మ ఐనా పరమాత్మ ఐనా విశ్వమందేలే!

తెలుగు భాష యందు భావ వర్ణములు

తెలుగు భాష యందు భావ వర్ణములు తేజములే
తెలుగు పదాల తీరు తెన్నులు మహా ఉత్తేజములే
తెలుగు పదాల భావములు తేట తెలుపు తేనీయములే
తెలుగు పద జాల అక్షరాలు అజరామ అమృతత్వములే
ఆంద్రుల తెలుగు దనము అమరావతీయ అమరత్వమేలే

Monday, April 6, 2015

ఆనాడు సూర్యోదయాన పని వేళలు

ఆనాడు సూర్యోదయాన పని వేళలు ఆరంభమయ్యేను
నేడు సూర్యాస్తమున కూడా పనులు ఆరంభ మవుతున్నాయి
ఆనాడు శ్రమించే విధానం ఆరోగ్యకరమైనది
నేడు శ్రమించే విధానాలలో అనారోగ్యాలు సంభవిస్తున్నాయి
నేడు జీవన విధానాలు చాలా కఠిన మవుతున్నాయి
నేడు అధిక జన సంఖ్య సాంకేతిక విజ్ఞానం వలన జీవన విధానాలు మారుతున్నాయి
స్త్రీలు శ్రమించుట వలన పురుషుల సమస్యలు భిన్నమవుతున్నాయి
జీవించుట తెలుసుకున్నా విశ్వ సృష్టి జీవన పరిస్థితి విధానాన్ని తెలుసుకోండి

మేధస్సులోని మలినము మనషులకేలా

మేధస్సులోని మలినము మనషులకేలా
వజ్రములోని మలినము వర్ణ తేజస్సులకేలా
విజ్ఞానములోని మలినము పండితులకేలా
మనస్సులోని మలినము నవ సమాజానికేలా
మలినముతో జీవితము అంధకారమగునులే

ఆలోచనకై ఆలోచిస్తూ ఆలోచనలతో

ఆలోచనకై ఆలోచిస్తూ ఆలోచనలతో సతమతమౌతున్నాను
సరైన ఆలోచన తోచక ఆలోచనలతో కాలం వృధా అవుతున్నది
అర్థమైన ఆలోచన ఉపయోగకరమైనదిగా ఉండాలని ఆలోచిస్తున్నా
ఉపయోగమైన ఆలోచనలకై ఎంత సమయం ఎన్ని రోజులో వృధా
ప్రతి రోజు ఆలోచిస్తూ మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాము
పని చేసే వేళ ఏకాగ్రతతో ఎన్నో సరైన ఆలోచనలు చేస్తుంటాము
ఏకాగ్రత లేని ఆలోచనలతో విశ్రాంతి వేళ ఎన్నో ఆలోచిస్తుంటాము
ఆలోచనలతో సమయం వృధా చేయక అనుభవాలతో ఆలోచించండి

ఎరుక లేని ఆలోచన ఏరువాకతో

ఎరుక లేని ఆలోచన ఏరువాకతో సాగనేలా
మనస్సు లేని ఆలోచన మనుల కేలా
భావం లేని ఆలోచన జీవుల కేలా
 అర్థం లేని ఆలోచన అనర్థమే గాని పరమార్థమేలా

Friday, April 3, 2015

భావాలతో బహు బంధాలెన్నో

భావాలతో బహు బంధాలెన్నో విశ్వమున సాగిపోతున్నాయి
బహు జీవుల భాషల భావాలే మరెన్నో బంధాలవుతున్నాయి
భావం లేని భాష లేదు భాష లేని భావమే స్నేహ బంధమయ్యేను
జీవాలు ఎన్ని ఉన్నా ప్రతి జీవి భావ అర్థాలే బంధాలుగా సాగేను
స్నేహ భావాల కోసమే జీవితాలు ఎన్నో బంధాలుగా సాగుతున్నాయి
స్నేహ భావం లేని జీవితం ఎడారి కైనా తెలియని పరమ రహస్యమే

విశ్వంలో ఏ ఆలోచన ఎక్కడ ఉన్నా


విశ్వంలో ఏ ఆలోచన ఎక్కడ ఉన్నా నా మేధస్సుకు చేరుతుంది
ఆలోచనలు ఎన్నైనా ప్రతి ఆలోచన నా మేధస్సులోనే ఉంటుంది
ఏ ఆలోచన ఐనా ఏ జీవి భావమైనా నాలోనే నిక్షిప్తమై ఉంటుంది
ఏ అణువు భావమైనా ఏ రూపం లేని కార్య భావమైనా నాలోనే
విశ్వమున ఏదాని ప్రభావం లేకుండా ఏది జరిగినా నాకు తెలిసేలా
ఏ ఊహ భావమైనా స్వప్న భావమైనా ఆకార చిత్ర భావమైనా నాదే
ఆత్మ అంతర్భావాన్ని జయించినప్పుడు ప్రతీది మనలోనే ఉంటుంది

స్వరము లేని సంగీతం సప్త స్వరాలుగా

స్వరము లేని సంగీతం సప్త స్వరాలుగా కదిలేనా నా మేధస్సులో
రాగం లేని నా పలకులలో రత్నాలను సృష్టించే గీతం నా యదలోనే
మనస్సు లేని మోహ భావం మకరందాన్ని పంచే మేఘ సందేశం
జీవమే లేని నా శ్వాస సరిగమలతో విశ్వమంతా జీవిస్తున్నది
--
కళ్ళు ఉన్న కళ లేని  చంద్రకళకు విశ్వ కాంతి ఉన్నదేమో
భావం ఉన్న ప్రతి రూపానికి బహు బంధాల స్వరాలు ఎన్నో
విద్య లేని వేదమైనా ఆవేదనలో వేదాంతమే ఉద్భవించేను
సంగీతాల వేద భావాలు జీవ రాగాలుగా సంగీతమయ్యేను

Thursday, April 2, 2015

సృష్టిని గ్రహణం వీడుతుందేమో

సృష్టిని గ్రహణం వీడుతుందేమో గాని మనిషిని కర్మ వీడదు
మరణం కర్మను వీడుతుందేమో గాని జన్మను ఏ మాత్రం వీడదు
ఆత్మ - కర్మ సిద్ధాంతముచే ఉద్భవించినది
ప్రతి జీవి ఆత్మ బంధముచే జన్మిస్తుంది
ప్రతి అణువు ఆత్మచే సృష్టింపబడుతుంది
ప్రతి అణువుకు ప్రతి జీవికి జీవిత కాలపు కార్యాలు ఉంటాయి
కర్మ అనగా కార్యం దానిని విజ్ఞాన అనుభవముచే చేధించాలి 
జీవిత కాలంలో మనం ఎన్నో కార్యాలను చేధిస్తూ సాగిపోవాలి
కృషితో నాస్తి దుర్భిక్షం విజ్ఞానంతో కర్మ చేధనం
సృష్టిని గ్రహణం వీడినా ప్రళయం వెంటాడుతూనే ఉంటుంది
సృష్టిని వెంటాడే కర్మలు - కరువు తుఫాను సునామి భూకంపం అగ్ని వాయు ఇసుక పొగ పర్వతాల భీభత్సాలు ఎన్నో
జీవితం అంటే కర్మను విజ్ఞానంతో ధైర్యంగా ఎదుర్కోవడమే
కార్య ఫలితము నష్టమైనా లాభమైనా ఆత్మ తృప్తియే
అనుభవ విజ్ఞాన సత్యముచే కర్మను ఆశ్రయించుట శ్రేయస్కరము
కార్యం ఉన్నంతవరకే శరీర జీవితం కార్యం లేనిచో ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది
కర్మ కార్యాలు పంచ భూతాలతో కూడి ఉంటాయి
ఆత్మ శరీరాన్ని వదిలినచో శరీరం పంచ భూతాలలో శూన్యమవుతుంది

జయ బ్రంహా జయ విష్ణు జయ దేవో మహేశ్వరా

జయ బ్రంహా జయ విష్ణు జయ దేవో మహేశ్వరా
జయ సాక్షత్ జయ విజ్ఞాన జయ కార్య సిద్దేశ్వరా
జయ ఉదయ జయ అస్తయ జయ కాల ధర్మ ప్రధానం
జయ జీవన జయ జీవిత జయ విద్య విశిష్ట దాయకం

జయ విజయ లక్ష్మీ తనయ

జయ విజయ లక్ష్మీ తనయ జయ రూప లక్ష్మి అష్టోతర
జయ జగత్ లక్ష్మి రూపేనా జయ కోటి కార్య సిద్ది ప్రదాయ    
జయ విజ్ఞాన లక్ష్మీ సరస్వతి జయ వినాయక మూల ప్రధానం
జయ జీవన జీవిత లక్ష్యం జయ లక్ష్మి జయ విజయ కటాక్షం!

జయ విజ్ఞాన వినాయక జయ తంత్ర గజానన


జయ విజ్ఞాన వినాయక జయ తంత్ర గజానన
జయ మూషిక లంబోధర జయ జనన ప్రథమోధర
జయ విజయ కృపా కటాక్ష జయ జగత్ శుభేశ్వర
జయ జీవన మూలాధారా జయ జీవత్ జీవేశ్వరా!

Where there is Universe


Where there is Universe there is the Knowledge
Where there is Light (Sun and Moon) there is an eye
Where there is Mind there is  confidence to work
Where there is Sense there is a systematic life

Wednesday, April 1, 2015

సత్యాన్ని రహస్యంగా ఉంచుట వలన

సత్యాన్ని రహస్యంగా ఉంచుట వలన విశ్వంలో అజ్ఞానమే పై స్థానం
ఒకరు తెలిపింది వారికి తెలిసేదే సత్యమని అధికారులు భావిస్తున్నారు
అజ్ఞానుల నుండి విజ్ఞానుల సత్యం పై స్థాయికి అసత్యంగానే చేరుతుంది
ఎందరో విజ్ఞానుల శ్రమ అజ్ఞానుల మాటలతో వృధా జీవితం అవుతున్నది
ఒక వస్తువు ఒకరి నుండి ఒకరికి ఇంకొకరికి మరొకరికి చేరుట వలన ఖరీదు ఎంతో పెరుగుతుంది
ఒకరి సామర్థ్యం ఒకరి నుండి ఇంకొకరి మరోలా చేరుట వలన లేదా అలానే చేరకుండ చేయగలరు
మధ్యస్థపు గారడి మనిషి వలన క్రింది స్థాయి వాళ్లకు చాలా వరకు ఉపయోగం లేకపోతున్నది
మధ్యస్థపు వారు తమ స్వార్థాలకే ఎక్కువగా పై స్థాయి వాళ్ళతో చర్చలు చేయగలుగుతారు 
జీవన విధానంలో సరికాని అలోచలనలతో సత్యాన్ని స్వార్థంతో అసత్యంగా మార్చుతున్నారు
మద్య స్థాయి పై స్థాయి వారి జీవితాలు బాగున్నా కింది స్థాయి వాళ్ళకు మాత్రం చాలా నియమాలు చెప్పేస్తారు 
అవసరమైన వారి జీవితం అధోగతి అనవసరమైన వారి జీవితం పురోగతిలా సాగుతున్నాయి
అందరి జీవితాలు ఇలా ఉండవు కొందరి జీవితాలు ఇలానే సాగుతూ ముగిసిపోతాయి

విశ్వం లేని జీవితం

విశ్వం లేని జీవితం మేధస్సు లేని జీవనం
విచక్షణ లేని శరీరం సిద్ధాంతం లేని జీవనం
సూర్య చంద్రులు లేని లోకం తేజస్సు లేని నేత్రం
మనస్సు లేని కార్యం ఏకాగ్రత లేని విజ్ఞానం