విశ్వమే అవతరించేనా
విశ్వమే అంతరించునా
జగమే అనుకరించేనా
జగమే అవరోధించునా
లోకమే అనుభవించేనా
లోకమే అనాదరించేనా
జ్ఞానమే విజ్ఞానించేనా
జ్ఞానమే అఙ్ఞానించేనా
ప్రతి జీవిలో ఉద్భవించునది మహోదయమై ఉదయించేనా
ప్రతి జీవిలో అంతరించునది మహాధ్వంసమై అస్తయించేనా
ప్రతి అణువులో ఆవిర్భవించునది మహోన్నతమై ఉపస్థితించేనా
ప్రతి అణువులో ఉపస్కరించునది మహాక్షయమై అస్వస్థతించేనా || విశ్వమే ||