తెలుసుకుంటావులే సత్యం
తెలుపుకుంటావులే నిత్యం
తలుచుకుంటావులే సర్వం
తపించుకుంటావులే నాదం
తిలకించెదవులే రూపం
తనిఖించెదవులే శిల్పం
తరించెదవులే భావం
త్యజించెదవులే తత్త్వం
తపనముల తాత్పర్యములే తనివి తీరిగా తపోధనచే తటస్థించునుగా
తరంగములు త్వరితములే తరుణ తీవ్రతగా తన్మయంచే తారసించునుగా || తెలుసుకుంటావులే ||
No comments:
Post a Comment