ఓ దేవా!.. మహాదేవా!.. మహానుభావా!...
సర్వం నా మేధస్సులోనే నిక్షిప్తమై సాగుతున్నది
నిత్యం నా దేహస్సులోనే నిర్ణీతమై వెళ్ళుతున్నది
భావం నా మేధస్సులోనే నిర్భయమై చలిస్తున్నది
తత్త్వం నా దేహస్సులోనే నిర్మలమై పారుతున్నది
వేదం నా మేధస్సులోనే నిర్మాణమై ఎదుగుతున్నది
నాదం నా దేహస్సులోనే నిర్వాణమై ఒదుగుతున్నది
కాలం నా మేధస్సులోనే నిరంతరమై పరిభ్రమిస్తున్నది
కార్యం నా దేహస్సులోనే నిరంకుశమై పరిశ్రమిస్తున్నది || ఓ దేవా!.. ||
జీవించుటలో జీవన పరిణామం ఉదయిస్తూనే అధిరోహిస్తున్నది
జ్ఞానించుటలో జీవిత పర్యాయం ఊరడిస్తూనే అధిగమిస్తున్నది
ప్రయాణించుటలో జీవన ప్రకృతి పర్యావరణమై ప్రభంజనతో పరిమళిస్తున్నది
ప్రవహించుటలో జీవిత ఆకృతి పత్రహరితమై ప్రభవస్థానంతో ప్రకాశమిస్తున్నది
No comments:
Post a Comment