Tuesday, December 26, 2023

అనంత పద్మనాభుడవో ఆకృత పరమాత్ముడవో

అనంత పద్మనాభుడవో ఆకృత పరమాత్ముడవో 
అమృత పరాత్పరుడవో ఆద్యంత పరస్పరుడవో 

అమర పరంజ్యోతివో అఖిల పరంధామవో 
అపూర్వ పర్యావరణవో అమల పత్రహరితవో 

ఆనంద పరంపరుడవో అద్భుత ఫణితల్పగుడవో 
అఖండ పర్యాటకుడవో అదండ్య పరమూర్తుడవో 

అపేక్ష పురుషోత్తముడవో ఆదర్శ పురోహితుడవో 
ఆరాధ్య ఫలదీకరణుడవో ఆశ్చర్య ప్రయోజనుడవో 


No comments:

Post a Comment