రహదారి మధ్యలో కాలువలు నిర్మించడం విశ్వ విజ్ఞాన మేధస్సులో ఎక్కడ లిఖించబడలేదు చెప్పబడలేదు
రహదారి మధ్యలో కాలువలు నిర్మించుట కేవలం వ్యాపారం కోసం ఆర్ధిక లాభాల కోసమే శ్రమకు ఫలితం లేనట్లు సాగుతున్నాయి విజ్ఞానానికి తెలియని ప్రశ్నగా కార్యాలు అజ్ఞానంతో సాగుతున్నాయి
రహదారి మధ్యలో కాలువలు నిర్మించడం ఎంతో ఇబ్బందికరం - సూటిగా వెళ్ళేవారు వాహనాన్ని అటుఇటు త్రిప్పుకుంటూ ముందు వెనుక ప్రక్కల వారికి ఇబ్బందులను ప్రమాదాలను కలిగిస్తూ ప్రయాణిస్తున్నారు
కాలువలు నిండిపోతే మురికి నీరు ఇంటిలోకి ప్రవహిస్తాయి
బరువైన వాహనాలు రహదారిలో వెళ్ళిపోతే కాలువల సంధి నిర్మాణాలు కూలిపోతున్నాయి ప్రయాణికులకు ఆటంకాలను ప్రమాదాలను సృష్టిస్తున్నాయి
కాలువలు రహదారికి ఇరువైపుల నిర్మించాలి - ఇండ్ల (గృహాములు) నిర్మాణములు రహదారుల కంటే ఒక అడుగు ఎత్తులో ఉండాలి - వర్షపు నీరు సాఫీగా ప్రవహించాలి
రహదారి యొక్క ఎత్తును ప్రభుత్వం నిర్మించాలి ఆ ఎత్తును ఎటువంటి పరిస్థితులలో మార్చకూడదు
గ్రామాన్ని నగరాన్ని చుట్టుప్రక్కల ప్రదేశాన్ని విచారణ సర్వేక్షణ పరీక్షణ చేసిన తర్వాతనే రహదారి యొక్క ఎత్తును నిర్ణయించాలి - రహదారి ఎత్తును తరతరాలకు మార్చకుండా సాగించాలి భవిష్య కాల పరిస్థితులకు అనుగుణంగా అనుభవాలతో గ్రహించి రహదారి ఎత్తును శాస్త్రయ సిద్ధాంత సూత్ర సూచన విజ్ఞాన అనుభవపరంగా నిర్ణయించాలి
ఒక సభా సమావేశంతో విజ్ఞాన సంభాషణలతో దేశాన్ని మార్చవచ్చు కార్యాలను అందరికి అనుకూలంగా ఉండేలా చేయవచ్చు అత్యంతమైన అద్భుతమైన ప్రణాళికలను ఏర్పాటు చేయవచ్చు గ్రామాలను నగరాలను పరిశుద్ధం చేయవచ్చు
భారతీయులలో విజ్ఞానం లేదా ఖనిజాలు లేవా ముడి సరుకులు (మూల పదార్థాలు) లేవా శ్రమించేవారు లేరా
ఉన్నవారందరు ఎత్తులో గృహాలను నిర్మించుకుంటున్నారు (కొంటున్నారు ఉంటున్నారు) సమస్యలు తెలియక జీవిస్తున్నారు సంతోషాలతో కాలాన్ని సాగిస్తున్నారు
లేనివారందరు ఇంటిలో ప్రవహించే మురికి నీరును తొలగించుకుంటూ శ్రమిస్తూ జీవితాలను వృధా చేసుకుంటున్నారు
నేటి కాలమున కాలువలు నిర్మించకుండానే గృహ నిర్మాణాలు సాగుతున్నాయి - విజ్ఞానం లేకుండానే అజ్ఞాన అనుభవాల కోసం శ్రమిస్తున్నారు (గృహ నిర్మాణం చేసుకుంటున్నారు) నిరాశ చెందుతున్నారు పేదవారిగా మారుతున్నారు ఇబ్బందులు పడుతున్నారు
ప్రతి ఇంటి వరుస ఒకే ఎత్తు స్థాయిలో ఉండేలా గృహాలను నిర్మించుకుంటే గ్రామమే కాదు నగరం సమాజం ప్రదేశం ప్రపంచం పరిశుద్ధతగా సమ విధానంగా కనబడుతుంది అభివృద్ధి ఏర్పడుతుంది
ప్రదేశం ఎత్తు తగ్గుదలలతో ఉంటే వాటి ఇంటి ఎత్తును పరీక్షించి నిర్ణయించుటకు విజ్ఞానులు ఉండాలి
ఎంత వివరించిన సమస్యలతో సాగే కాలం మన ప్రదేశ జీవన విధాన జీవిత మార్గం
కాలం మారుతుంది అంటే విజ్ఞానం చెందాలి కాని అజ్ఞానులు చేరి దానిని అజ్ఞానంగానే సాగిస్తున్నారు సాధిస్తున్నారు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment