మేలుకో మాధవ ... నీ రూపాన్ని విశ్వానికి ఉదయింపజేయవా
మేలుకో మహాత్మ ... నీ రూపాన్ని జగతికి పరిచయింపజేయవా
నీ ముఖ రూపాన్ని నేను ఎన్నడూ చూడలేదు కాస్తైనా కనిపించలేదు
నీ ముఖ బింబాన్ని నాకు ఎప్పుడూ చూపలేదు జాడైనా తెలియలేదు || మేలుకో ||
ఏమి భాగ్యమో నీ దర్శనం సుదర్శనం
ఏమి సౌఖ్యమో నీ ఆనందం మహానందం
ఎంతటి అఖిలమో నీ రూప వైభవం
ఎంతటి అమోఘమో నీ ఆకార వైభోగం
ఏమి చిత్రమో నీ సువర్ణ రూపం
ఏమి ఆత్రమో నీ సుందర ఆకారం
ఏమి గాత్రమో నీ సుమధుర గానం || మేలుకో ||
ఎక్కడి భావమో నీ రూపమే సుగంధ పుష్పోదయం
ఎక్కడి తత్వమో నీ బింబమే సుమిత్ర భాష్పోదయం
ఎంతటి దైవమో నీ దేహమే దయతో కూడిన ప్రేమామృతం
ఎంతటి జీవమో నీ వేదమే కరుణతో కలిగిన స్నేహామృతం
పరలోక పరబ్రంహ మహా ద్వారమున నీ దివ్య ముఖ దర్శనం
పరలోక పరవిష్ణు మహా ప్రవేశమున నీ విశ్వ రూప నిదర్శనం
పరలోక పరశివ క్షేత్రమున నీ ముఖ బింబమే సర్వ సుదర్శనం || మేలుకో ||