Saturday, May 9, 2020

ఎక్కడున్నావు ఈశ్వరా

ఎక్కడున్నావు ఈశ్వరా
ఎక్కడెక్కడ ఉంటావు పరమేశ్వరా

ఏ రూపంతో ఉన్నావు ఈశ్వరా
ఏ ఆకారంతో ఉంటావు పరమేశ్వరా

ఏ పిలుపుతో వస్తావు ఈశ్వరా
ఏ పలుకుతో చూస్తావు పరమేశ్వరా 

నీవే నాకు జీవేశ్వరా నీవే నాకు జగదీశ్వరా
నీవే నాకు లోకేశ్వరా నీవే నాకు జ్ఞానేశ్వరా

నీలోన నేనే అర్ధనారీశ్వరా నీలోన నేనే గౌరీశంకరా
నీలోన నేనే అర్ధనారీశ్వరా నీలోన నేనే గౌరీశంకరా  || ఎక్కడున్నావు ||
 
నిత్యం నీవే నా జ్ఞానం సర్వం నీవే నా వేదం
నిత్యం నీవే నా ధ్యానం సర్వం నీవే నా దైవం

ఉచ్చ్వాసలోన నీవే శరణం నిచ్చ్వాసలోన నీవే మరణం
స్వరధ్యాసలోన నీవే శరణం పరధ్యాసలోన నీవే మరణం 

జీవించుటలోనే గమనం ఉదయించుటలోనే చలనం
ప్రభవించుటలోనే చరణం ఉద్భవించుటలోనే కరణం  || ఎక్కడున్నావు ||

నిత్యం నీవే నా భావం సర్వం నీవే నా తత్వం
నిత్యం నీవే నా జీవం సర్వం నీవే నా రూపం

విశ్వసించుటలో నీవే నా ఉదారం ఆస్వాదించుటలో నీవే నా మధురం
తపస్వించుటలో నీవే నా సహనం స్వీకరించుటలో నీవే నా మోహనం 

ప్రతి నామ పదంలో నీవే ఓంకారం ప్రతి నాద పరంలో నీవే శ్రీకారం
ప్రతి జ్ఞాన పదంలో నీవే కారుణ్యం ప్రతి వేద పరంలో నీవే ప్రావీణ్యం  || ఎక్కడున్నావు || 

No comments:

Post a Comment