శంకరా శివ శంకరా
ఈశ్వరా పరమేశ్వరా
శేఖరా చంద్ర శేఖరా
భాస్కరా భావ పుష్కరా
అణువణువునా ఉన్నావురా పరమాణువునా ఉన్నావురా
తనువణువునా ఉన్నావురా మనువణువునా ఉన్నావురా
అంతమై ఉన్నావురా ఆద్యంతమై ఉన్నావురా
ఆస్కారమై ఉన్నావురా అత్యంతమై ఉన్నావురా
అదృశ్యమై ఉన్నావురా అదూరమై ఉన్నావురా
ఆదర్శమై ఉన్నావురా ఆధిక్యమై ఉన్నావురా || శంకరా ||
బ్రంహాండాన్ని సృష్టించావురా బ్రంహోత్సవాన్ని అందించావురా
అంతరిక్షాన్ని అందించావురా అంతర్భావత్వాన్ని సందర్శించావురా
మహోత్సవాన్ని చూపించావురా సమన్వయాన్ని కలిగించావురా
మహోదయాన్ని వెలిగించావురా మృదంగాన్ని వినిపించావురా
స్వయంభువమై సంకల్పించావురా స్వయంకృతమై సత్కరించావురా
సంభూతమై సమిష్టించావురా సమాకృష్యమాణమై సంపూర్ణించావురా || శంకరా ||
విభూషణమై పరిగణించావురా విజ్ఞాణ్యతమై విశ్వసించావురా
విశుద్ధతమై పరిశోధించావురా విశ్వామిత్రమై విన్నవించావురా
విభాసితమై వినియోగించావురా విరాజితమై వికసించావురా
విధాతృత్వమై అవతరించావురా విధానతమై ప్రభవించావురా
అపూర్వమై ఆవరించావురా అఖండనమై ఆశ్రయించావురా
అధ్యాయమై అభ్యసించావురా అద్వితీయమై ఆఙ్ఞాపించావురా || శంకరా ||
No comments:
Post a Comment