నాలోని ప్రకృతిని మీరు చూడలేరుగా
నాలోని ఆకృతిని మీరు చూపలేరుగా
నాలోని భావాలను మీరు తెలుసుకోలేరుగా
నాలోని తత్త్వాలను మీరు తెలుపుకోలేరుగా
నాలోని జ్ఞానాన్ని మీరు పరిశోధించలేరుగా
నాలోని వేదాన్ని మీరు పరిశీలించలేరుగా
నాలో ఏమున్నదో ఏవేవి ఉన్నాయో విశ్వానికే ఎరుక
నాలో ఏమున్నదో ఏవేవి ఉన్నాయో మర్మానికే మణిక || నాలోని ||
No comments:
Post a Comment