నీవు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా తెలిసేలా
ఎవరు ఎక్కడున్నా మరెవరు ఎక్కడున్నా తెలిపేలా
ఎవరు ఎక్కడైనా ఎవరు ఎలాగైనా కలిసేలా
మీరు ఎలాగున్నా వారు ఎలాగున్నా కలిపేలా
మీరు ఎప్పుడైనా వారు ఎప్పుడైనా తక్షణమే వచ్చేలా
మీరు ఎక్కడున్నా వారు ఎక్కడున్నా ఈక్షణమే వెళ్ళేలా
ఎవరికి ఏ బంధం లేకున్నా తెలుసుకునేలా
ఎవరికి ఏ బంధం వద్దన్నా కలుపుకునేలా
ఎవరికి ఎవరు లేకున్నా ఆదుకునేలా
ఎవరికి ఎవరు రాకున్నా ఉండిపోయేలా
కాలంతో ఎన్నో మారుతూపోతున్నాయి
సమయంతో ఎన్నో కలుగుతూపోతున్నాయి
జీవితంలో మానవ భావాలు చాలా విలువైనవి
జీవనంలో మానవ తత్త్వాలు చాలా వెలుగైనవి || నీవు ఎక్కడున్నా ||