Wednesday, November 12, 2025

సూర్యుడే కార్య దర్శకుడు మార్గ దర్శకుడు

సూర్యుడే కార్య దర్శకుడు మార్గ దర్శకుడు  
సూర్యుని ప్రకాశమే మేధస్సులోని ఆలోచనలను ఉత్తేజవంతం చేస్తూ కార్యాలను నడిపిస్తుంది 

కార్యాలను ఎప్పుడు ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలి ఎక్కడ ప్రారంభించాలో సూర్య ప్రకాశమే ఆలోచనలకు తెలుపుతుంది 

ఏ కార్యం ఎప్పుడు ఆరంభిస్తే ఎలా ఎప్పుడు ముగిసిపోతుందో సూర్య ప్రకాశమే మార్గాన్ని చూపుతుంది 
సూర్యుని ప్రకాశంలో వెలుగుతో పాటు ఎన్నో అద్భుతమైన ఆలోచనలు ఉపాయాలు ప్రయోజనాలున్నాయి 

ప్రతి మానవునికి సూర్యుడే ఆది గురువుగా ఉన్నట్లు సూర్యని ప్రకాశాన్ని గమనించే వారికి తెలుస్తుంది 
విశ్వ సృష్టిలో ప్రతి అణువుకు ప్రతి జీవికి ఆది గురువు సూర్యుడని తమ భావ తత్వాలకు తెలియకున్నా బ్రంహాండానికి తెలుస్తుంది 

సూర్యునితోపాటు కాల సమయంతో ఎన్నో మార్పులు (గ్రహించలేని సూక్ష్మమైనవి) ప్రతి క్షణం బ్రంహాండమంతా సాగిపోతుంటాయి 


-- వివరణ ఇంకా ఉంది 

No comments:

Post a Comment