Thursday, November 27, 2025

ప్రయాణించుటలో 'మ' వద్దు అని చెప్పుకోవాలి

ప్రయాణించుటలో 'మ' వద్దు అని చెప్పుకోవాలి  తెలుసుకోవాలి ప్రశాంతంగా సాగిపోవాలి 

మ - మద్యం 
మ - మత్తు 
మ - మైకం 
మ - మూర్ఛ 
మ - మరుపు 
మ - మాంసం 
మ - మభ్యం 
మ - మోసం 
మ - మలినం 
మ - మూఢత్వం 
మ - మూర్ఖత్వం 
మ - మరణం 

ప్రయాణించుటలో ఎదురుగా వచ్చే వారిని గురించి అదిరిపోవద్దు వెనుక నుండి వచ్చే వారిని గురించి భయపడవద్దు ఇరుప్రక్కల వచ్చే వారిని గురించి ఆశ్చర్యపడవద్దు (ఆందోళన చెందవద్దు)

ప్రయాణంలో జరిగే సంఘటనల గురించి కలత చెందవద్దు నీ ప్రయాణమే నీకు ప్రధానం నీ గమ్యమే నీ సామర్థ్యం ప్రశాంతం విజయం 

ప్రయాణంలో ఎవరు ఎలా ప్రయాణిస్తున్నా నీ వేగం అదుపులో ఉండాలి నీ వాహనం దేహస్సు సురక్షితంగా సాగాలి 
మేధస్సు ప్రయాణ మార్గం యొక్క రూపాంతరాన్ని గమనిస్తూ దృష్టి సాగించాలి 

నీ ప్రయాణం ఇంకొకరికి ప్రమాదం కాకూడదు 

విజ్ఞానంతో ఎరుకతో అనుభవంతో జాగ్రత్తతో ప్రయాణించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment