సూర్యోదయమే ఉదయించునా నా హృదయములో
పూజ్యోదయమే ఉద్భవించునా నా హృదయములో
పూర్వోదయమే ఆవిర్భవించునా నా హృదయములో
పుష్పోదయమే అవతరించునా నా హృదయములో
హృదయమే అనుమతించునా సూర్యోదయం నా మేధస్సులో
హృదయమే సమ్మతించునా పూజ్యోదయం నా దేహస్సులో
హృదయమే ఆకర్షించునా పూర్వోదయం నా మనస్సులో
హృదయమే ఆచరించునా పుష్పోదయం నా శ్రేయస్సులో
నా హృదయమే విశ్వ భావమై జీవ తత్వమై జగమంతా కిరణ సౌందర్య ప్రకాశం పరివర్తించునా || సూర్యోదయమే ||
No comments:
Post a Comment