ప్రకృతీ ... నీ యందు నేను ప్రవృత్తినై ఎదుగుతున్నా
ఆకృతీ ... నీ యందు నేను ఆదృతినై ఒదుగుతున్నా
జాగృతీ ... నీ యందు నేను జేతృతినై పర్యవేక్షిస్తున్నా
నివృత్తీ ... నీ యందు నేను నేతృతినై పరిశోధిస్తున్నా
ఆవృతీ ... నీ యందు నేను ఆవృత్తినై ప్రకాశిస్తున్నా
సంస్కృతీ ... నీ యందు నేను సంవృత్తినై ప్రబోధిస్తున్నా
వివృతీ ... నీ యందు నేను విస్తృతినై ప్రయాణిస్తున్నా
మాతృతీ ... నీ యందు నేను మంతృతినై ప్రస్తావిస్తున్నా
స్వీకృతీ ... నీ యందు నేను సకృతినై ప్రమోదిస్తున్నా
సుకృతీ ... నీ యందు నేను సంసృతినై ప్రచారిస్తున్నా
No comments:
Post a Comment