విజ్ఞేశ్వరా జీవించరా
జీవిస్తూనే శ్వాసను సాగించరా
జీవేశ్వరా జీవించరా
జీవిస్తూనే ధ్యాసను సాగించరా
జీవియందు నీ శ్వాస ధ్యాస యోగమై మేధస్సునే ఆలోచింపునురా
కాలేశ్వరా జీవించరా
జీవిస్తూనే కాలాన్ని సాగించరా
కార్యేశ్వరా జీవించరా
జీవిస్తూనే కార్యాన్ని సాగించరా
జీవియందు నీ కాల కార్యం లీనమై దేహస్సునే శ్రమింపునురా
ధ్యానేశ్వరా జీవించరా
జీవిస్తూనే ధ్యానాన్ని సాగించరా
ప్రాణేశ్వరా జీవించరా
జీవిస్తూనే ప్రాణాన్ని సాగించరా
జీవియందు నీ ధ్యాన ప్రాణం ఏకమై మనస్సునే స్మరింపునురా
రూపేశ్వరా జీవించరా
జీవిస్తూనే రూపాన్ని సాగించరా
నాదేశ్వరా జీవించరా
జీవిస్తూనే నాదాన్ని సాగించరా
జీవియందు నీ రూప నాదం వయస్సునే వృద్ధింపునురా
No comments:
Post a Comment