అజ్ఞానంతో అనారోగ్యంతో కాలం సాగుతున్నది
విజ్ఞానంతో ఆరోగ్యంతో సమయం వెళ్ళుతున్నది
కాలానికి తెలియదే జీవుల దేహ భావ తత్త్వాలలో అజ్ఞానం అనారోగ్యం కలుగుతున్నదని
సమయానికి తెలియునే జీవుల శ్వాస ధ్యాసలలో విజ్ఞానం ఆరోగ్యం సమకూర్చుకోవాలని
శ్రమించే జీవుల దేహస్సుకు అర్థాన్ని గ్రహించే జీవుల మేధస్సుకు తెలియునులే ప్రకృతి పరివర్తన విధానం జీవన పరిణామం || అజ్ఞానంతో ||
కాలంతోనే సాగుతున్నా సమయంతోనే ఎన్నో గ్రహిస్తూ తెలుసుకోవాలి
కార్యంతోనే సాగుతున్నా కార్యాచరణతోనే ఎన్నో భరిస్తూ తెలుపుకోవాలి
కాలంతోనే విరమిస్తూ సమయంతోనే ఆరంభిస్తూ ఎన్నో కార్యాలను సక్రమంగా సరిచేసుకోవాలి
కార్యంతోనే విహరిస్తూ సమయంతోనే సహకరిస్తూ ఎన్నో పాఠాలను సంగ్రహంగా ఆర్జించుకోవాలి
దేహాన్ని జీవాన్ని ధ్యాస శ్వాసలతో స్వభావ తత్త్వాలతో సమయస్ఫూర్తితో సరిచూసుకోవాలి
దేహాన్ని జీవాన్ని కార్య గమనాలతో హృదయ స్పందనలతో సందర్భస్ఫూర్తితో సరిచేసుకోవాలి || అజ్ఞానంతో ||
కాలంతోనే కార్యాలన్నీ సాగిస్తూ ఎన్నో కార్యాలను విజయవంతంగా చేసుకోవాలి
కార్యంతోనే కాలాన్ని సాగిస్తూ ఎన్నో కారణాలను సమయార్థవంతంగా చూసుకోవాలి
కాలంతోనే దేహాన్ని సాగిస్తూ జీవంతో ప్రయాణిస్తూ కార్యాలను పరిపూర్ణవంతంగా పూరించుకోవాలి
కార్యంతోనే జ్ఞానాన్ని గ్రహిస్తూ జీవంతో సహకరిస్తూ కృత్యాలను సంపూర్ణవంతంగా సాధించుకోవాలి
దేహాన్ని జీవాన్ని ఆరోగ్య విజ్ఞానాలతో అపార పరిశుద్ధం చేసుకుంటూ సాగిపోవాలి
దేహాన్ని జీవాన్ని ఆహార వ్యవహారాలతో అభ్యాస పవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోవాలి || అజ్ఞానంతో ||
No comments:
Post a Comment