Sunday, November 5, 2023

సూర్యోదయమా సూర్యతేజమా

సూర్యోదయమా సూర్యతేజమా 
సూర్యకిరణమా సూర్యతరంగమా 

సూర్యవర్ణమా సూర్యబింబమా 
సూర్యచిత్రమా సూర్యరూపమా 

ప్రజ్వలమై ఉదయించవా ప్రచోదనమై నడిపించవా 
ప్రకాండమై ఉద్భవించవా ప్రభాతమై అధిరోహించవా 

ప్రచ్యుతమై ఆస్వాదించవా ప్రభూతమై ఆకర్షించవా
ప్రమోదనమై ఆవిర్భవించవా ప్రఖ్యాతమై ఆవహించవా  || సూర్యోదయమా || 

నీవు లేని గమనం చలనం లేని ప్రయాణం 
నీవు లేని కార్యక్రమం క్రమం లేని చరితం 

నీవు లేని విధానం ప్రధానం లేని ప్రమాణం 
నీవు లేని విరాటం ప్రభావం లేని ప్రమేయం 

నీతోనే కార్యాలన్నీ ఆరంభం నీతోనే కార్యాలన్నీ విశ్రాంతం 
నీతోనే జీవులకు మహా ప్రశాంతం నీతోనే జీవులకు మహా ప్రశుద్ధం 

నీతోనే కార్యాలన్నీ విజయం నీతోనే కార్యాలన్నీ సమాప్తం 
నీతోనే జీవులకు ఎంతో ఉత్కంఠం నీతోనే జీవులకు ఎంతో ఉత్తేజం  || సూర్యోదయమా || 

నీవులేని జీవనం ప్రవోజనం లేని ప్రకరణం 
నీవులేని జీవితం ప్రద్యోతం లేని ప్రణాయకం 

నీవు లేని ప్రకృతి ఐశ్వర్యం లేని ఆకృతి 
నీవు లేని జాగృతి అభివృద్దిలేని సంస్కృతి 

నీతోనే కార్యాలన్నీ ప్రవాహం నీతోనే కార్యాలన్నీ పరిభ్రమణం 
నీతోనే జీవులకు మహా విజ్ఞానం నీతోనే జీవులకు మహా వినయం 

నీతోనే కార్యాలన్నీ క్రమక్రమం నీతోనే కార్యాలన్నీ క్రమశిక్షణం 
నీతోనే జీవులకు ఎంతో ప్రజ్ఞానం నీతోనే జీవులకు ఎంతో ప్రశోధనం  || సూర్యోదయమా || 

No comments:

Post a Comment