మరణాన్ని నిలిపింది నా జీవ భావన - మరణాన్ని తప్పించింది నా ధ్యాస తత్త్వన
మరణాన్ని అడిగింది నా జీవ స్వభావన - మరణాన్ని విడిచింది నా ధ్యాస దైవత్వాన
మరణమే తెలిపింది వెళ్ళిపోయేదనని నా భావనకు - మరణమే పలికింది తిరిగిపోయేదనని నా తత్త్వనకు
మరణమే వినిపించింది రాలేకపోయేదనని నా భావనకు - మరణమే విరమించింది వీలులేకపోయేదనని నా తత్త్వనకు
మరణమే స్మరిస్తున్నది నా భావనచే - మరణమే జీవిస్తున్నది నా తత్త్వనచే
మరణమే సహిస్తున్నది నా భావనచే - మరణమే జ్ఞానిస్తున్నది నా తత్త్వనచే
మరణమే లేదా నీ భావనకు - మరణమే లేదా నీ తత్త్వనకు
మరణమే లేదా నీ ఆలోచనకు - మరణమే లేదా నీ ఆలోకనకు