Saturday, September 27, 2025

ప్రతి స్వరూపంలో జ్ఞానమే ప్రతి ఆకారంలో జ్ఞానమే

ప్రతి స్వరూపంలో జ్ఞానమే ప్రతి ఆకారంలో జ్ఞానమే 
ప్రతి ప్రాకారంలో జ్ఞానమే ప్రతి ప్రకారంలో జ్ఞానమే 

ప్రతి వేదంలో జ్ఞానమే ప్రతి నాదంలో జ్ఞానమే 
ప్రతి విధంలో జ్ఞానమే ప్రతి బేధంలో జ్ఞానమే 

ప్రతి కార్యంలో జ్ఞానమే ప్రతి ధైర్యంలో జ్ఞానమే 
ప్రతి ధర్మంలో జ్ఞానమే ప్రతి సత్యంలో జ్ఞానమే 

ప్రతి దేశంలో జ్ఞానమే ప్రతి ప్రాంతంలో జ్ఞానమే 
ప్రతి రాజ్యంలో జ్ఞానమే ప్రతి రంగంలో జ్ఞానమే 

ప్రతి స్థానంలో జ్ఞానమే ప్రతి స్థైర్యంలో జ్ఞానమే 
ప్రతి బంధంలో జ్ఞానమే ప్రతి స్తంభంలో జ్ఞానమే 


-- వివరణ ఇంకా ఉంది!

 

Monday, September 22, 2025

పిల్లల కోసం తల్లితండ్రులు ఎలా శ్రమిస్తున్నారో పిల్లలకు తెలియదు

పిల్లల కోసం తల్లితండ్రులు ఎలా శ్రమిస్తున్నారో పిల్లలకు తెలియదు 
తల్లి తండ్రుల కోసం పిల్లలు ఎలా శ్రమిస్తున్నారో తల్లి తండ్రులకు తెలియదు 


-- వివరణ ఇంకా ఉంది!

నవ రాత్రులు నవ విధమైన భావ తత్వములు

నవ రాత్రులు నవ విధమైన భావ తత్వములు 
నవ విధాల అవతారములు నవీన విధ కార్యములు 

నవ జ్యోతుల కాంతులు నవ గ్రహ సునందములు సూర్య ప్రభావములు 
నవ తేజములు నవ గుణముల సులోచనములు చంద్ర ప్రభావితములు 

నవ ధాన్య నవీన పుష్పములు సుగంధాల సుపరిచిత పరిమళములు 
నవ భావ నవీన తత్వములు స్వభావాల సులోచిత పర్యావరణములు 

నవ విజ్ఞాన జీవన విధాన నైపుణ్యములు నవ ఉపాధిత భోగ భాగ్యములు 
నవ ప్రధాన సమయ విధాన ఋతువులు నవ సమన్విత యోగ యాగములు 

నవ రూప నందన శ్రేష్ఠిత ఆకారములు నవ దిశ ధర్మ కాల భవిష్య జ్ఞానములు 
నవ రాగ సంగీత క్షేత్రిత ఆలయములు నవ ధాత విశ్వ కాల అఖండ స్వరూపములు  


-- వివరణ ఇంకా ఉంది!
 

తెలుసుకుంటే తెలియనివారు లేరుగా

తెలుసుకుంటే తెలియనివారు లేరుగా 
పరిచయాలతో ఎందరినైనా తెలుసుకుంటూ సాగితే ఎవరితో కలిసినా తెలిసినవారే  
తెలిసినవారే తెలియని వారితో పరిచయాలను కలిగిస్తూ సాగితే మనతో మాట్లాడే వారంతా తెలిసినవారే  

తెలియనివారిని తెలుసుకొనుటలో పరిచయాలతో బంధాలు సంబంధాలు కూడా కొందరితో ఏర్పడవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, September 19, 2025

పరమాత్మా! నీ స్వభావ భావ తత్వాలు తెలిసిన వారు విశ్వతిలోనే ఉన్నారా

పరమాత్మా! నీ స్వభావ భావ తత్వాలు తెలిసిన వారు విశ్వతిలోనే ఉన్నారా 
పరమాత్మా! నీ స్వభావ భావ తత్వాలతోనే సంతోషించు వారు జగతిలోనే ఉన్నారా 


-- వివరణ ఇంకా ఉంది! 

దేహంలోనే అన్నీ ఆత్మ పరమై దాగి ఉన్నాయి

దేహంలోనే అన్నీ ఆత్మ పరమై దాగి ఉన్నాయి శరీరానికే అర్థమయ్యేలా మేధస్సు ఆలోచించుటలో తెలుపుకోవాలి 

దేహంలోనే అనంతం పరమాత్మమై విశ్వ బ్రంహాండమంతా ఒదిగి ఉన్నది శరీరం ధ్యానించుటలో దేహం అంతర్భావం నుండి సర్వాన్ని బహిర్గతం చేస్తుంది  

విజ్ఞానంతో ప్రశాంతగా విశ్వంలో కార్య సాధనతో పరిశోధన చేస్తే సర్వ భావ తత్వములు అద్భుతంగా ఉద్భవిస్తాయి 

పుష్పం వికసించునట్లు దేహం అనంత స్వభావాల భావ తత్వాలతో ఏకాంతంతో ప్రశాంతమై అమూల్యమైన కాంతులతో పరిశుద్ధమై పరిపూర్ణంగా ఉద్భవిస్తూ విజ్ఞానంతో బ్రంహాండమంతా పరమాత్మంతో పరమార్ధంతో ఉదయిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

శ్రమించడం తెలియదా శ్రమించడం తెలుసుకోవా

శ్రమించడం తెలియదా శ్రమించడం తెలుసుకోవా 
శ్రమించడం తోచదా శ్రమించడం తలచుకోవా (తలచవా)

శ్రమించడం కలుగదా శ్రమించడం నేర్చుకోవా 
శ్రమించడం సహించవా శ్రమించడం ఓర్చుకోవా 

శ్రమించడమే జీవించుటలో పరమ సౌఖ్యమని జీవితంలో తెలుసుకోలేవా నీవే గుర్తించలేవా 
శ్రమించడమే ఎదుగుటలో పరమ భాగ్యమని సహితంలో తెలుపుకోలేవా నీవే ఆర్జించలేవా    || శ్రమించడం || 

శ్రమకే సమయం లేదా శ్రమకే సహనం లేదా 
శ్రమకే సహాయం లేదా శ్రమకే సమానం లేదా 

శ్రమకే సమస్తం లేదా శ్రమకే సమర్థం లేదా 
శ్రమకే సోపానం లేదా శ్రమకే సమ్మతం లేదా 

శ్రమకే స్వతంత్రం లేదా శ్రమకే సంతోషం లేదా 
శ్రమకే సులభం లేదా శ్రమకే సుఫలం లేదా 

శ్రమించుటలో ఆలోచనలే కార్యాలను నడిపించే సమయ సాధన ఆయుధాల శాంతియుత విజయం 
శ్రమించుటలో గమనములే కార్యాలను సమీపించే సమయ సహన స్వభావాల విశ్రాంతిత ప్రశాంతం    || శ్రమించడం || 

శ్వాసనే గమనిస్తూ ధ్యానిస్తున్నావా

శ్వాసనే గమనిస్తూ ధ్యానిస్తున్నావా 
ధ్యాసనే గమనిస్తూ శ్రమిస్తున్నావా 

కార్యాన్నే గమనిస్తూ పరిశోధిస్తున్నావా 
కాలాన్నే గమనిస్తూ ప్రయాణిస్తున్నావా 

జ్ఞానమే గమనిస్తూ సాగుతున్నావా 
మార్గాన్నే గమనిస్తూ వెళ్ళుతున్నావా 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, September 18, 2025

ఒక్కడే శ్రమించుటలో ప్రతిఫలం లేదురా

ఒక్కడే శ్రమించుటలో ప్రతిఫలం లేదురా  

శ్రమించిన ఫలితమంతా ఖర్చులతో శూన్యమై సమస్యలు మిగిలేనురా 
సమస్యలు తీరనిచో ఖర్చులు అధికమై మరో కొత్త సమస్యలు తోడై శ్రమకే భారమై శరీరమే వాలిపోయేనురా 

శ్రమకు తోడుగా మరో శ్రామికుడు జతగా చేరితే ప్రతిఫలం అధికమై సమస్యలెన్నో తీరిపోతూ (పాత సమస్యలు) సంతోషంగా జీవించెదమురా 

అభివృద్ధిని కలిగించి సంతోషాన్ని సాగించే సమస్యలనే తీర్చుకోవాలి 
ఐశ్వర్యాన్ని మిగిలించి ఆనందాన్ని వృద్ధించే కార్యాలనే సాగించుకోవాలి 

బంధమే జతగా కుటుంబమే తోడుగా సమస్యలే ఏర్పడినా కలిసిపోయే శ్రమలో కలదురా అపారమైన ప్రతిఫలం 

 
-- వివరణ ఇంకా ఉంది!

విశ్వాన్ని నీవు వింటున్నావు జగతిని నీవు దర్శిస్తున్నావు

విశ్వాన్ని నీవు వింటున్నావు జగతిని నీవు దర్శిస్తున్నావు 
బ్రంహాండాన్ని నీవు ధరిస్తున్నావు లోకాన్ని నీవు ఆలోచిస్తున్నావు 

సృష్టిని నీవు తలుస్తున్నావు శ్రమను నీవు భరిస్తున్నావు 
కార్యాన్ని నీవు సాగిస్తున్నావు కాలాన్ని నీవు దాటేస్తున్నావు 


-- వివరణ ఇంకా ఉంది! 

Wednesday, September 17, 2025

Most valuable amount for everyone is One Rupee

Most valuable amount for everyone is One Rupee (One Dollar, One Euro, One Yen, One Yuan, etc.) which is get it first time to start save the amount.

Who are getting more than one Rupee to start the savings those are in new generations (or rich) and they don't know the olden days hard work of value (wages to get it by manual work and wait for some days) how it is difficult to get it.

One rupee is most important for any amount. Without One rupee you can't add rupee's it means without money how you think how much amount you have so starting One rupee is also most important to save.
Without amount life if dificcult and if you have money you can do anything and you can utilize any way.

If you eat it will not get it back, if you buy something you have thing's, if you invest to business you will get profit or loss, if you invest to education you will get knowledge (eligibility) to work (employment).

Savings is important and utilization is important.
Utilization is important more than savings/expenditure (how to save and how to utilize). How much your savings also important.

-- Still need more explanation / discussion to understand!

పరమాత్మా! నీవు ఎలా ఉన్నావో విశ్వానికే తెలియాలి

పరమాత్మా! నీవు ఎలా ఉన్నావో విశ్వానికే తెలియాలి   
పరమాత్మా! నీవు ఎక్కడ ఉన్నావో జగతికే తెలియాలి 
పరమాత్మా! నీవు ఎప్పటి నుండి ఉన్నావో బ్రంహాండానికే తెలియాలి  

పరమాత్మా! నీవు ఎప్పుడు ఎక్కడ ఎలా స్వయంభువమై ఉద్భవించావో మాతృ భావాల పితృ తత్వాల సృష్టికే తెలియాలి 

పరమాత్మా! నీవు ఉన్నావని ఎవరికి తెలుసు 
పరమాత్మా! నీవు సర్వం గమనిస్తున్నావని ఎవరికి తెలుసు

పరమాత్మా! నీవు ఎలా ఏ విధంగా ఏ రూపంతో ఏ భావ తత్వాలతో జీవిస్తున్నావు
పరమాత్మా! నీవు ఎలా ఏ విధంగా ఏ రూపంతో ఏ భావ తత్వాలతో దర్శనమిస్తావు 

పరమాత్మా! నీవు జీవించే ప్రదేశం పరిశుద్ధమైన పవిత్రమైన ప్రకృతి పర్యావరణమతో నిండిన స్వచ్ఛమైన పరిపూర్ణమైన పరిమళమైన పంచభూతాల శుభోదయమై ఉన్నదా 


-- వివరణ ఇంకా ఉంది!

Need to establish very Broad roads before developing Cities

Need to establish very Broad roads before developing Cities, Towns, and Villages. 
It will be helpful for future living methodologies and utilizing latest technology facilities with many more advantages also everyone feels to breath happily in proper distance and healthy.

Not only the Roads everything needs to make broadly even Houses, Shopping Complexes, Parking Places, Gardens, Grounds, Factories, Convention Halls, Auditoriums, Drainage's, Water Storage Areas, Rain Water Flow Areas, Reservoirs, Temples, Visiting Places, Tourism Places, Burial Grounds/Places, Daily Wastage Removal Outskirts Places, Bus Stations, Railway Stations, Airports, Ship Yards, Rocket Launches Places, Schools, Colleges, Organizations, Car Festival Places, Stage Meeting Places, Cinema Halls, Footpaths, Crossing Roads, (Cracker Manufacturing Places, Defense Places, Ammunition Places), etc.

Every sector or department needs to work to make broadly and using friendly with enough space for all the generations without harming the nature growths.

Everyone need to maintain clean, peace, knowledgeable, behavior, protecting and other goods ways with matured and experienced in all the areas/sectors/departments.

Less maintenance makes more durability with less risk and health to live with safe environment and purity of green nature for all generations.

All the places need to monitor by securities (every person) to keep the places clean, safety, healthy, freely (not groping more crowd) and other useful way.

For every event need precautions (common sense with knowledge and past experience and future expectations) before starting the work in all the seasons and all the situations in all the generations.

Money or Business is not important for providing the services (if it risk to man power make it low cost).

Services: Health, Technology, Purity of natural resources, Food, Journey (without pollution all the areas and sectors/departments), etc.

Now a days man is understanding anything and creating any product and doing any service (Implementing, developing, maintaining, repairing, assembling, designing, testing, analyzing, explaining, researching, etc.).
To find the needs how to use the products and what type your required and how it will be functioning need to get the ideas then creating is easy by many machines with instruments and tools.


-- Still need more explanation/discussion to understand!

Tuesday, September 16, 2025

మేధస్సులో అనంతమైన ఆలోచనలు ఉద్భవిస్తూనే ఉన్నాయి

మేధస్సులో అనంతమైన ఆలోచనలు ఉద్భవిస్తూనే ఉన్నాయి ఎన్నో అపారమైన కార్యాలు సాగుతూనే ఉన్నాయి 

అనంతమైన ఆలోచనలలో విజ్ఞాన అభివృద్ధి ఉన్నా జీవించుటకు ఐశ్వర్యం ప్రధానమైనదిగా ప్రథమమైనదిగా ముఖ్యాంశమై ప్రతి మానవునికి మిక్కిలి అవసరమౌతున్నది 

ఎలా విజ్ఞానంతో సత్ప్రవర్తనతో పరిశుద్ధతతో జీవించామో తెలుసుకొనుటకైనా ఎలా ఐశ్వర్యంగా ఎదుగుతున్నామో కుటుంబంతో పాటు సమాజం ఎదురు చూస్తున్నది 
కుటుంబంలో ప్రతి రోజు ఐశ్వర్య అభివృద్ధికై ఎన్నో ఆలోచనల ఎన్నో కార్యాలతో ఏంతో శ్రమ సాగుతున్నది 

శ్రమించుటలో ఫలితం లేని మానవులు కార్య సిద్ధి విజ్ఞాన నైపుణ్యంతో సాగాలి సరైన శ్రమ సాధనతో మహా అభ్యాసతో కృషించాలి  

విశ్వంలో ఎన్ని అద్భుతాలు దర్శించినా ఎన్ని ఆశ్చర్యాలు వింటున్నా నీ యందు ఐశ్వర్యం ఉంటేనే జీవించుటలో చమత్కారం కార్యాలలో సాఫల్యత ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉంది!

శరీర భావనయే దేహ తత్త్వం

శరీర భావనయే దేహ తత్త్వం 

ఆలోచనల స్వభావాలే శరీర భావాల చలనం - భావాల చలనమే దేహంలో కలిగే తత్త్వం 
జ్ఞానేంద్రియాల అన్వేషణయే మేధస్సులో ఆలోచనల ఉత్పన్నం - ఆలోచనల స్వభావాలే జ్ఞానేంద్రియాల అర్థాన్ని గ్రహించు విధానం 

అర్థాన్ని గ్రహించునది మేధస్సులో దాగిన జ్ఞాపకాల నిర్మాణ విధానం 
అర్థంలో అపార్థం (అనర్థం) లేదా విజ్ఞానం లేదా అజ్ఞానం లేదా పరమార్థం వివిధ రకాలుగా జ్ఞాపకాల నిర్మాణ విధానంలో దాగి ఉండవచ్చు 

వీలైనంతవరకు మానవ మేధస్సులో అర్థాలను విజ్ఞాన పరమార్థంగా జ్ఞాపకాల నిర్మాణంలో దాచుకోవాలి 

మనం తెలుసుకునేదే అర్థం మన అవగాహనయే విజ్ఞానం మనం గ్రహించునదే మన జ్ఞాపకం 

మేధస్సులో ఆలోచనలు అర్థాలుగా అనర్థాలుగా అజ్ఞానంగా విజ్ఞానంగా పరమార్థంగా కలుగుతూనే వివిధ రకాల అవగాహనలతో జ్ఞాపకాల నిర్మాణంలో చేరిపోతాయి  
జ్ఞాపకాల నిర్మాణంలో అర్థాలు చేరిపోయేటప్పుడు దాచుకునేటప్పుడు ఆలోచనల భావాల యధార్థ విజ్ఞాన అర్థాలే దాచుకోవాలి అప్పుడు విజ్ఞానం అభివృద్ధి చెంది భావాలు పరిశుద్ధమైన పరమార్ధంతో ఉంటాయి కార్యాలు పరమార్థ అనుభవాలతో సాగుతూ సత్ఫలితాలను ఇస్తాయి 

జననం ఒక భావన మరణం ఒక తత్వన జీవితం ఎన్నో కార్యాల సంగమం 

-- వివరణ ఇంకా ఉంది! 

జననం అద్భుతమే మరణం ఆశ్చర్యమే జీవితం చమత్కారమే

జననం అద్భుతమే మరణం ఆశ్చర్యమే జీవితం చమత్కారమే  

జన్మించుటలో అద్భుతం మనకు తెలియదు మరణించుటలో ఆశ్చర్యం మనకు తెలియనివ్వదు 
జీవించుటలో చమత్కారమే శ్రమతో సాగే చాతుర్యమైన కార్యక్రమాల మహా విజ్ఞాన భావ జీవితం 



-- వివరణ ఇంకా ఉంది!

పరమాత్మా! ఎవరి కోసం విశ్వాన్ని ఎందుకు సృష్టించబడింది ఎలా ఉద్భవించింది

పరమాత్మా! ఎవరి కోసం విశ్వాన్ని ఎందుకు సృష్టించబడింది ఎలా ఉద్భవించింది 

జీవుల విజ్ఞానముకై భావ తత్వాలతో జీవితాన్ని సాగించుటకై అనుభవాల కార్యక్రమాలతో ఎన్నో సాగిపోతున్నాయి 

ఏ జీవికి ఎప్పుడు ఏ విజ్ఞానమో ఎప్పుడు అజ్ఞానమో వివిధ కార్యక్రమాలే ఎన్నో కారణాలతో నిర్ణయిస్తాయి 

విశ్వంలో పరిశుద్ధత పవిత్రత స్వచ్ఛమైన పరిమళ ప్రకృతి పర్యావరణం ఎన్నో విధాలుగా ఎన్నో ఆకార రూపాలతో ఉద్భవించింది 

విశ్వం ఎలా ఉద్భవించినా మానవుని విజ్ఞానం ఎన్నో విధాలుగా సాగే అన్వేషణలలో పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి ఎన్నో విషయాలు తెలుస్తూనే ఉన్నాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

Monday, September 15, 2025

ఎక్కువగా శ్రమించుటలో వెన్నెముక శ్వాస నాళం రెండు అతుక్కుపోయి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి

ఎక్కువగా శ్రమించుటలో వెన్నెముక శ్వాస నాళం రెండు అతుక్కుపోయి ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రయాసాలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

Sunday, September 14, 2025

వయస్సు ఎదుగుతున్నప్పుడు పరమాత్మ ప్రభావ స్వభావాలు శరీర మేధస్సులో కలుగుతూ సాగాలి

వయస్సు ఎదుగుతున్నప్పుడు పరమాత్మ ప్రభావ స్వభావాలు శరీర మేధస్సులో కలుగుతూ సాగాలి 

శ్వాస ప్రయాస ప్రశాంతమైతే దేహం ధ్యాస ఏకాంతమైతే విజ్ఞాన ఆలోచనలు ప్రకృతి వైపు మళ్ళితే పరమాత్మ స్వభావాల భావ తత్వాలు విశ్వమంతా అన్వేషిస్తూ పరిశోధిస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

మీ శ్వాస ప్రయాస ప్రశాంతంగా ఉంటే మీ తల్లి తండ్రుల శ్వాస ప్రయాస ఆరోగ్యంగా ఉంటుంది

మీ శ్వాస ప్రయాస ప్రశాంతంగా ఉంటే మీ తల్లి తండ్రుల శ్వాస (ధ్యాస) ప్రయాస ఆరోగ్యంగా ఉంటుంది 

మీ నుండి ఎటువంటి ఆటంకం ఎవరికి లేదంటే అందరు సురక్షితంగా ప్రశాంతంగా ఉంటారు జీవిస్తారు 

ప్రతి ఒక్కరు సురక్షితంగా జీవిస్తే ఆవేశం అనవసరం (అజాగ్రత్త, అజ్ఞానం) లాంటి కార్యాలు కలగకుండా గొప్ప కార్యాలు సాగిపోతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

 

జగమే మాయమా శ్రమిస్తే సత్యమా

జగమే మాయమా శ్రమిస్తే సత్యమా 
జనమే జన్మమా సహిస్తే సాధ్యమా 

శ్వాసయే జీవమా దేహమే శరీరమా  
ధ్యాసయే దైవమా కార్యమే కాలమా 

జీవించుటలో శరీరం ఆరోగ్యంతో శాశ్వత కాలమా దేహం ఆహారంతో అశాశ్వత సమయమా 
ధ్యానించుటలో శరీరం గమనంతో అమర కాలమా దేహం ఆహారంతో సమన్విత సమయమా 


-- వివరణ ఇంకా ఉంది!

Friday, September 12, 2025

పూర్వం ఎవరు ఉన్నారో తెలియదు భవిష్య కాలంలో ఎవరు ఉంటారో తెలియదు

పూర్వం ఎవరు ఎలా ఉన్నారో తెలియదు భవిష్య కాలంలో ఎవరు ఎలా ఉంటారో తెలియదు 

ప్రస్తుత కాలంలో ఉన్న మనం భవిష్య కాలంలో ఉన్న వారికి మెరుగైన విజ్ఞానం స్వచ్ఛమైన ఆరోగ్యం నిర్మలమైన ఆనందం పరిశుద్ధమైన ప్రకృతి పరిశుభ్రతగల వసతి పరిపూర్ణమైన ప్రశాంతత యోగ్యతమైన ప్రవర్తన ప్రఖ్యాతగల ప్రయాణం అన్ని విధాలా అన్ని కార్యక్రమాలకు అందించాలి  


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులో నిరంతంతరం విజ్ఞానంతో పాటు ఆరోగ్యం కూడా కలగాలి ఆచరించాలి

మేధస్సులో నిరంతంతరం విజ్ఞానంతో పాటు ఆరోగ్యం కూడా కలగాలి ఆచరించాలి  

విజ్ఞానముకై ఎంత శ్రమిస్తామో (ఆలోచిస్తామో నేర్చుకుంటామో జ్ఞాపకం చేసుకుంటామో) ఆరోగ్యంకై అంతే విశ్రాంతి చెందాలి అలాగే వ్యాయామం చేయాలి నిద్రించాలి 


-- వివరణ ఇంకా ఉంది!

తెలియనిది తెలుసుకొనుటకు జీవిస్తున్నామా - తెలిసిన దానితో సాగిపోతూ జీవిస్తున్నామా

తెలియనిది తెలుసుకొనుటకు జీవిస్తున్నామా - తెలిసిన దానితో (ఆచరిస్తూ) సాగిపోతూ జీవిస్తున్నామా 

ఏది తెలిసినా తెలియక పోయినా ఉన్న దాని కంటే గొప్పగా హితంగా ఉన్నతంగా విజ్ఞానంగా కొత్తగా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండుటకై ఉన్నవారితో కలిసిమెలిసి జీవించుటకు ఎన్నో కనుగొనుటకు గొప్పగా ఆలోచిస్తూ తరతరాలుగా శ్రమిస్తూ జీవిస్తున్నాము 

ఎవరు ఎప్పుడు ఏమి కనుగొన్నారో, ఎవరు ఎప్పుడు ఏమి కనుగొంటారో ఎవరికి తెలుసు - వేచి ఉండి తెలుసుకోవాలి ఆరోగ్యంతో సాగిపోవాలి ఉపయోగమైతే అన్ని రకాల అన్ని విధాలా ఆలోచిస్తూ ఆచరించాలి 


-- వివరణ ఇంకా ఉంది! 

Thursday, September 11, 2025

విశ్వంలో సర్వ జీవములు ప్రకృతిలో భాగమే - సర్వ జీవములు ప్రకృతియే - జీవములన్నీ ప్రకృతియే

విశ్వంలో సర్వ జీవములు ప్రకృతిలో భాగమే - సర్వ జీవములు ప్రకృతియే - జీవములన్నీ ప్రకృతియే 

విశ్వంలో ప్రకృతియే పరమ జీవ ఆహారం పరిశుద్ధమైన ఔషధం  
ప్రకృతిలో అరణ్యములే ఆహారమైనా జీవములు కూడా ఆహారమే  

ప్రకృతి శాఖాహారంతో ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది (పంచభూతాల ఋతువులతో జీవిస్తుంది)
ప్రకృతి (అరణ్యములు) శాఖాహారంతో (ఆకులతో, వృక్షములతో) ఎదుగుతుంది అభివృద్ధి చెందుతుంది 
ప్రకృతి స్వచ్ఛమైన పరిశుద్ధమైన పంచభూతాల ఋతువులతో జీవిస్తుంది

జీవములు శాఖాహారంతో జీవిస్తాయి మాంసాహారంతో జీవిస్తాయి ఎదుగుతాయి 
మాంసాహార జీవులు ఉన్నంతవరకు జీవులన్నీ ప్రకృతిలో ఒక విధమైన (ఆహార) భాగమే (మానవుడు కూడా)

ఏ మాంసాహార ఇతర జీవి మానవుడు ఆహారం కాదని తలచదు అవకాశం కలిగితే మానవుడుడైనా మహాత్ముడైనా  ఆకలికి ఆహారమే 

మానవుడు తన విజ్ఞానంతో వివిధ రకాలుగా వివిధ భాగాలుగా తన సిద్ధాంతాన్ని అనుగుణంగా మార్చుకుంటున్నాడు - ఇతర జీవులకు ఎల్లపుడూ ఎన్ని తరాలైనా జీవించుటలో ఒకే సిద్ధాంతం [ఒకే (జీవ) శాస్త్ర విజ్ఞానం]


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి జీవికి జీవ శాస్త్ర విఙ్ఞావం చాలు జీవించుటకు - మానవునికే సర్వ విధముల శాస్త్ర విజ్ఞానం చాలటం లేదు జీవించుటకు

ప్రతి జీవికి జీవ శాస్త్ర విఙ్ఞావం చాలు జీవించుటకు - మానవునికే సర్వ విధముల శాస్త్ర విజ్ఞానం చాలటం లేదు జీవించుటకు 

ఎన్ని శాస్త్రముల విజ్ఞానం తెలిసినా మానవునికి తను ఎదుగుటలో ఏ విజ్ఞానం (అనుభవం) సరిపోవుట లేదు 
కొత్త కొత్త సూక్ష్మ పరిశోధనములు చేస్తూ ఎన్నో శాస్త్ర విజ్ఞానములు గ్రహించినా ఎదుగుటకు సరిపోవుట లేదు సంతృప్తి చెందుట లేదు 

మానవుని మేధస్సు అనంతమైన కార్యాలతో అనంతమైన అణువులతో రూపాలతో పరిశోధన విజ్ఞానం వివిధ రకాలుగా ఎన్నో స్వభావాలతో మిగిలిపోయి ఉన్నది 


-- వివరణ ఇంకా ఉంది! 

నేత్రము లేని ప్రయాణము వాహన విజ్ఞానము లేని జీవితము

నేత్రము లేని ప్రయాణము వాహన విజ్ఞానము లేని జీవితము 
నేత్రము లేని ఎదుగుదల సర్వ సాధారణతో నెమ్మదిగా సాగును  

నేత్రములు అన్ని విధాలా జీవించుటలో వేగాన్ని పెంచుతాయి విజ్ఞానంతో పాటు ఖర్చులను పెంచుతాయి 


-- వివరణ ఇంకా ఉంది!

నా వాళ్ళు నన్ను గుర్తించాలంటే నేను ఎదగాలి

నా వాళ్ళు నన్ను గుర్తించాలంటే నేను ఎదగాలి 
నేను ఎదగాలంటే నా శ్రమను గుర్తించే వారు ఉండాలి 

శ్రమను చూస్తారే తప్ప గుర్తించరు ఫలితం అందించరు 
మాటలతో శ్రమను ఇంకా పెంచమంటారే గాని ఓదార్చరు 

శ్రమలో లోపం లేనప్పుడు శ్రమలో నైపుణ్యం ఉన్నప్పుడు ఫలితం అందించేటప్పుడు ఎదుటివారికి అర్హత లేని స్వార్థం యోగ్యత లేని అహం కలుగుతుందేమో  

స్వార్థం అహంతో ఐశ్వర్యవంతులు కావచ్చేమో గాని ఉత్తములు కాలేరు పలుకుబడి ఉండవచ్చేమో గాని నిర్మలమైన పరిచయాలు ఉండవు మాటలలో నిబంధనలే గాని సహాయాలు ఉండవు 


-- వివరణ ఇంకా ఉంది!
 

నిద్రించుటలో మన శ్వాస ఎలా ప్రశాంతంగా ఉంటుందో శ్రమించుటలో కూడా అలాగే సాగితే ఆయుస్సు శతాబ్దం అవుతుంది

నిద్రించుటలో మన శ్వాస ఎలా ప్రశాంతంగా ఉంటుందో శ్రమించుటలో కూడా అలాగే సాగితే ఆయుస్సు శతాబ్దం అవుతుంది  

మన ఉచ్చ్వాస నిచ్చ్వాసాలు ఎప్పుడూ ఒకే ప్రయాసలో సాగిపోతే మన శరీరంలో సహనం సామర్థ్యాలు వివిధ కార్యాలకు చాలావరకు సహకరిస్తాయి 

శ్వాస ప్రయాస ఎలా ఉంటే శరీరం అలా ఆరోగ్యంతో జీవిస్తుంది 

ఆరోగ్యం మహా భాగ్యం శరీరం మహా కార్యం దేహం మహా యోగం శ్వాస మహా ఆయుధం ధ్యాస మహా విజ్ఞానం గమనం మహా ప్రభావితం 


-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, September 10, 2025

ఎంత చదివినా ఎంత నేర్చినా

ఎంత చదివినా ఎంత నేర్చినా 
ఎంత తెలిసినా ఎంత తెలిపినా 

ఎంత కాలం శ్రమించినా ఎంత కాలం జీవించినా
చివరికి అలసితినీ ... ! మరణానికి సిద్ధమై వేచితిని (నీ ... !)   || ఎంత చదివినా || 

ఎన్నో విధాలుగా ఎన్నో కార్యాలతో ఏంతో కాలం ఎన్నో చేసితిని (నీ ... !)
ఎన్నో రకాలుగా ఎన్నో భావాలతో ఏంతో కాలం ఎన్నో చూసితిని (నీ ... !)

ఎన్నో విధాలుగా ఎన్నో మార్పులతో ఎంతో సమయం ఓర్చితిని (నీ ... !)
ఎన్నో రకాలుగా ఎన్నో తత్వాలతో ఎంతో సమయం ధరించితిని  (నీ ... !)

ఎన్నో బంధాలతో ఎన్నో పరిచయాలతో ఎంతో కాలం గడిచితిని (నీ ... !)
ఎన్నో స్వరాలతో ఎన్నో ప్రయాణాలతో ఏంతో కాలం సాగించితిని (నీ ... !)

ఎన్నో రూపాలతో ఎన్నో పరిశోధనలతో ఎంతో సమయం అన్వేషించితిని (నీ ... !)
ఎన్నో జీవాలతో ఎన్నో పరిణామాలతో ఎంతో సమయం పరిభ్రమించితిని (నీ ... !)

ఉండాలని మేధస్సు తెలిపినా పోవాలని మనస్సు తలచినా వెళ్ళిపోవాలని దేహస్సు తపిస్తున్నది (దీ ... ! )
ఓ మహా దేవా ... 1 

జీవం పోసి దేహం నిలిపి రూపం దాల్చి శరీరాన్ని నడిపించి ఎన్నో బంధాలతో ఎన్నో కార్యాలతో విశ్వమంతా తిరిగించి అలసట కలిగించి జగతి నుండి నీ అహం తరిమేస్తున్నది (దీ ... ! )

జీవం నిలుచుటకు ఏ విజ్ఞానం ఏ మంత్రాన్ని కనుగొనలేదు 
రూపం సాగించుటకు ఏ వయస్సు ఈ దేహాన్ని ఓర్చుటలేదు  

ప్రశాంతంగా మరణించేందుకు పరిశుద్ధమైన మనస్సును స్వచ్ఛమైన ప్రదేశంలో నా శరీరాన్ని పంచభూతాలకు ఆత్మ సాక్షిగా అర్పించెదవా  || ఎంత చదివినా || 

జీవం నిలుపుకొనుటకు శ్వాసనే ఎంతో కాలం శాంతంగా గమనించితిని (నీ ... !)
రూపం సాగించుకొనుటకు ధ్యాసనే ఎంతో కాలం జాగ్రత్తగా స్మరించితిని (నీ ... !) 

నిత్యం తెలుసుకొనుటకు ఎన్నో బంధాలతో ఎంతో కాలం సాగుతూ మరణం ఉందని మరచితిని (నీ ... !)
సర్వం దాచుకొనుటకు ఎన్నో కార్యాలతో ఎంతో కాలం శ్రమిస్తూ మరణం లేదని భ్రమించితిని (నీ ... !)

యోగం కలిగేందుకు ఎన్నో ప్రయత్నాలతో ఎంతో సమయం గడిపేస్తూ మరణం ఉందని సహించితిని (నీ ... !) 
భాగ్యం వరించేందుకు ఎన్నో పరిశోధనలతో ఎంతో సమయం ప్రయాణిస్తూ మరణం లేదని కలగంటితిని (నీ ... !)

ఉండేదెవరో మేధస్సుకు తెలియదా పోయేదెవరో మనస్సుకు తెలియదా వచ్చిపోయేవారెవరో దేహస్సుకు తెలిసేనా (నా .. !)


జీవం అందించి దేహం జోడించి రూపం కల్పించి ఎన్నో బంధాలతో ఎన్నో కార్యాలతో జగమంతా శ్రమించి ఓర్చుట  స్తభించి  విశ్వతి నుండి నీ స్థైర్యం విశ్రమిస్తున్నది (దీ ... ! )

జీవం నిలుచుటకు ఏ విజ్ఞానం ఏ ఔషధాన్ని కనుగొనలేదు 
రూపం సాగించుటకు ఏ వయస్సు ఈ బంధాన్ని ఓర్చుటలేదు

ప్రశాంతంగా మరణించేందుకు పరిశుద్ధమైన మనస్సును స్వచ్ఛమైన ప్రదేశంలో నా శరీరాన్ని పంచభూతాలకు ఆత్మ సాక్షిగా అర్పించెదవా  || ఎంత చదివినా || 


-- మరణానికి నేను ఎప్పుడు తలవంచితినో అప్పుడే నా సర్వ భావాల తత్వాలు దేహం నుండి వదిలిపోయి విశ్వ ప్రకృతిలో లీనమై పంచభూతాలుగా చిగురిస్తూ జగమంతా నిరంతరం అభివృద్ధి చెందుతూ బ్రంహాండాన్ని విజ్ఞానంతో పరిశోధిస్తూ ఉంటాయి 

-- మరణానికి వేచి ఉన్నవారికి కోరికలు ఉండవు 
-- ఆరోగ్యం ఉన్నవారికి విజ్ఞాన పరిశోధనలు ఉండాలి 

Tuesday, September 9, 2025

రెండు చేతులు ఎంత కాలం శ్రమిస్తాయి

రెండు చేతులు ఎంత కాలం శ్రమిస్తాయి 
నాలుగు చేతులు శ్రమిస్తూ ఉంటే కార్యాలు సులువుగా సాగిపోతూ ఎన్నో లాభాలను పొందుతాయి  

నాలుగు చేతులు శ్రమిస్తున్నప్పుడు అలసట చెందకుండా రెండు చేతులు కార్యాన్ని సాగిస్తూ మరో రెండు చేతులు విశ్రాంతిని పొంది సామర్త్యాన్ని పెంచుకొని మరల మరో రెండు చేతులతో కలిసిపోతూ కార్యాన్ని సాగిస్తూ శ్రమిస్తాయి (శ్రమించాలి)
అలాగే మరో రెండు చేతులు కలిసినప్పుడు మొదటి నుండి శ్రమిస్తున్న రెండు చేతులు విశ్రాంతిని పొంది సామర్త్యాన్ని పెంచుకొని మరో రెండు చేతులతో కలిసిపోయి శ్రమిస్తాయి (శ్రమించాలి)

ఇలా నాలుగు చేతులు ఎన్నో కార్యాలను సాగిస్తూ పోతే సమస్యలు తీరిపోతూ అభివృద్ధిని త్వరగా చేరుకుంటాయి 
శ్రమలో సంతోషం ప్రశాంతం సామర్థ్యం నైపుణ్యం ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం అన్నీ సమకూరుతాయి అన్ని విధాలా శుభంతో సాగిపోతాయి 

ఇంట్లో రెండు చేతులే శ్రమిస్తూ పోతే కార్యాలు సులువుగా సాగవు అలాగే అనారోగ్యం కూడా కలగవచ్చు ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు సమస్యలు తీరకుండా ఉండిపోవచ్చు 

ఇంట్లో ఐనా సమాజంలో ఐనా ఎక్కడైనా జతగా పనిచేస్తూ శ్రమిస్తూ పోతే ఏ కార్యాలైనా ఎన్నో విధాలుగా  ఎన్నో విజయాలను సాధిస్తాయి ఎన్నో సమస్యలను పరిష్కారింపడతాయి 


-- వివరణ ఇంకా ఉంది! 

మంత్రం మేధస్సును ఉత్తేజంతో మెప్పిస్తూ దివ్యమైన భావాలతో బ్రంహాండాన్ని దర్శిస్తుంది

మంత్రం మేధస్సును ఉత్తేజంతో మెప్పిస్తూ దివ్యమైన భావాలతో బ్రంహాండాన్ని దర్శిస్తుంది  

మంత్రంలో అనేకమైన భావ తత్వాలు అనంతమైన దివ్య స్వరూపాలు విశ్వ ప్రభావాలున్నాయి 
మంత్రంలో పంచభూతాలు ఏకమై అపూర్వమైన శక్తి స్వరూపాలతో అపారమైన విజ్ఞానాన్ని కలిగిస్తాయి 

మంత్రంలో శాస్త్రీయ సిద్ధాంతాలు అమూల్యమైన భాషా పద పరమార్థాలు దాగి ఉన్నాయి 
మంత్రాన్ని ఉద్ఘాటించునప్పుడు దేహంలో అనంతమైన శక్తి స్వభావ తత్వాలు వివిధ స్వరాలతో విజ్ఞానమై ఉద్భవిస్తాయి 

మంత్రం మాట కాదు సత్యంతో కూడిన సనాతన ధర్మం - జీవ సూత్ర జీవన సూచన శాస్త్రీయ సిద్ధాంతం - ఆచరణీయ ప్రథమం 

-- వివరణ ఇంకా ఉంది!

Sunday, September 7, 2025

శ్రమించినదంతా శరీరానికే ఖర్చులు చేసుకుంటూ పోతే జీవితం అభివృద్ధితో ఎలా సాగుతుంది

శ్రమించినదంతా శరీరానికే ఖర్చులు చేసుకుంటూ పోతే జీవితం అభివృద్ధితో ఎలా సాగుతుంది 

శరీరానికి శ్రమ ఆహారం వ్యాయామం ఆరోగ్యమే అవసరం - శరీరానికి ఆభరణం అలంకరణం ప్రకృతియే ఇస్తుంది  


-- వివరణ ఇంకా ఉంది!

Monday, September 1, 2025

ఆలోచనలే ఆహారాన్ని ఆరగిస్తాయి జీర్ణింపజేస్తాయి

ఆలోచనలే ఆహారాన్ని ఆరగిస్తాయి జీర్ణింపజేస్తాయి 
శరీరమే ఆహార శక్తిని శ్రమించుటకు ఉపయోగించును 

మనం శ్రమించలేక పోయినా ఆకలి దాహం వేస్తాయంటే ఆహారాన్ని ఆలోచనలే ఆరగిస్తాయి ఆలోచనలే జీర్ణింపజేస్తాయి 


-- వివరణ ఇంకా ఉంది!

రుచితో ఆరోగ్యం అభిరుచితో మహా భాగ్యం

రుచితో ఆరోగ్యం అభిరుచితో మహా భాగ్యం 

పరిశుద్ధమైన ప్రకృతి ఆహారం రుచించుటలో మహా ఆనందం ఆరోగ్యం 
పరిపూర్ణమైన ప్రకృతి ఆహారం అభినయంతో రుచించుటలో మహా ప్రసాదం మహా భాగ్యం 

స్వచ్ఛమైన పరిమళమైన పరిపూర్ణమైన పరిశుద్ధమైన ప్రకృతి ఆహారం శరీరానికి ఆరోగ్యంతో పాటు మహా ఆనందాన్ని మహా శక్తిని మహా ఉత్తేజాన్ని ఇస్తుంది  


-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి జీవికి పంచభూతములు ముఖ్య అవసరం

ప్రతి జీవికి పంచభూతములు ముఖ్య అవసరం 

పంచ భూతములు ప్రకృతిలోనే కాక సకల జీవులలో కూడా దాగి ఉన్నాయి 

పంచ భూతములను (ప్రకృతిని) ఐదు కంటే ఎక్కువ రకాలుగా వివిధ భాగాలుగా కూడా విభజించవచ్చు 
ఐదు రకాలు ప్రధాన మైనవి అందుకే పంచ భూతములుగా నిర్ణయించారు 

గాలి (వాయువు, శ్వాస) 
నీరు (జలం - సముద్రం, మేఘం - వర్షం) 
భూమి (ప్రదేశము, ఖండములు) 
ఆకాశము (ఆవరణము, రక్షణ) 
అగ్ని (సూర్యుడు, తేజము)

మనిషికి (జీవికి) శ్వాస, దాహం, స్థానం, ఆకలి, రక్షణ నిరంతరం అవసరం 

భూమి ఆకాశం కలిసిపోతే అంతరిక్షం 

పంచభూతములు సకల జీవులు జీవించుటకు ఆశ్రయములు 

పంచభూతములు ఎదిగినా తరిగినా కాలంతోపాటు సాగిపోతూనే ఉంటాయి 
పంచభూతములు స్వయంభువ జనన ప్రభావములు పరమాత్మ (అదృశ్య శక్తి) సంకల్పితమైనవి  


అదృశ్య శక్తి - ఉదాహరణ: గాలి (వాయువు),  శ్వాస - పర ఆత్మ శక్తితో కూడినవి  


-- వివరణ ఇంకా ఉంది!

మేధస్సులో ఆలోచన శరీరంలో శ్రమయత్నం కలిగేంతవరకు ఏ కార్యక్రమాలు జరగిపోవు

మేధస్సులో ఆలోచన శరీరంలో శ్రమయత్నం కలిగేంతవరకు ఏ కార్యక్రమాలు జరగిపోవు  

-- వివరణ ఇంకా ఉంది!

ప్రతి రోజు ప్రతి ఇంటికి పంచభూతాలు పరిశుద్ధంగా ప్రవేశించేలా ప్రకృతి ప్రతి రోజు అభివృద్ధి చెందుతుంది

ప్రతి రోజు ప్రతి ఇంటికి పంచభూతాలు పరిశుద్ధంగా ప్రవేశించేలా ప్రకృతి ప్రతి రోజు అభివృద్ధి చెందుతుంది 

ప్రకృతి అభివృద్ధియే జీవులకు ఆరోగ్యం 

ప్రకృతి అభివృద్ధియే విశ్వ ప్రదేశానికి సహజమైన స్వచ్ఛమైన పరిమళం ఆరోగ్యవంతమైన పర్యావరణం పరిశుద్ధమైన ప్రభావితం పరిపూర్ణమైన సామర్థ్యం 


-- వివరణ ఇంకా ఉంది! 

పరమాత్ముని శ్వాస నాళము పంచ భూతములలో లీనమైయున్నది

పరమాత్ముని శ్వాస నాళము (వాయు నాళము) పంచ భూతములలో లీనమైయున్నది 


-- వివరణ ఇంకా ఉంది!