ఏ పాటకు అదే భావన కలిగేనా
ఏ పాటకు అదే తత్వన కలిగేనా
ఏ పాటకు అదే శ్వాస కలిగేనా
ఏ పాటకు అదే యాస కలిగేనా
ఏ పాటకు అదే భాష కలిగేనా
ఏ పాటకు అదే ధ్యాస కలిగేనా
ప్రతి పాటలో అదే స్వరం అదే రాగం కలిగేనా
ప్రతి పాటలో అదే గాత్రం అదే ఆత్రం కలిగేనా
ప్రతి పాటలో సరిగమలైనా సంగీతమే పదనిసలైనా సంగాత్రమే
ప్రతి పాటలో సరిగమలైనా సాహిత్యమే పదనిసలైనా పాండిత్యమే || ఏ పాటకు ||
నేను తలచిన గీతంలో ఏ వేదం ఏ నాదం కలుగునో
నేను తలచిన గానంలో ఏ జీవం ఏ రూపం కలుగునో
నేను తలచిన పదంలో ఏ అర్థం ఏ జ్ఞానం కలుగునో
నేను తలచిన పద్యంలో ఏ సత్వం ఏ లక్ష్యం కలుగునో
నేను స్మరించిన విశ్వంలో ఏ గమనం ఏ చలనం కలుగునో
నేను స్మరించిన లోకంలో ఏ చరితం ఏ భరితం కలుగునో || ఏ పాటకు ||
నేను తలచిన పాదంలో ఏ గుణం ఏ తరం కలుగునో
నేను తలచిన పాఠంలో ఏ కావ్యం ఏ కార్యం కలుగునో
నేను తలచిన శ్లోకంలో ఏ దివ్యం ఏ తేజం కలుగునో
నేను తలచిన అంశంలో ఏ ఆద్యం ఏ అంతం కలుగునో || ఏ పాటకు ||
నేను ధ్యానించిన కాలంలో ఏ అద్భుతం ఏ అమోఘం కలుగునో
నేను ధ్యానించిన కోణంలో ఏ ఆనందం ఏ అమృతం కలుగునో || ఏ పాటకు ||