Monday, August 2, 2021

ఆనందం పరమానందం మన ఆత్మ పరమాత్మం పరతత్వం పరమార్థం

ఆనందం పరమానందం మన ఆత్మ పరమాత్మం పరతత్వం పరమార్థం 
ఆనందం పరమానందం మన ఆత్మ పరాంగవం పరస్పరం పరాప్రకృతం  

ఆనందం పరమానందం మన ఆత్మ పరిశుద్ధం పరిశుభ్రం పరిపూర్ణం 
ఆనందం పరమానందం మన ఆత్మ పర్యావరణం పత్రహరితం పరాచలం   || ఆనందం || 

పరమాత్మలోనే నివసించు మన ఆత్మ దేహం మహా తత్వమైన జీవమే 
పరమాత్మలోనే ఉదయించు మన ఆత్మ రూపం మహా దివ్యమైన తేజమే 
 
పరమాత్మలోనే ప్రభవించు మన ఆత్మ లోకం మహా పూజ్యమైన యోగమే 
పరమాత్మలోనే ప్రయాణించు మన ఆత్మ గమ్యం మహా రాజ్యమైన భోగ్యమే

పరమాత్మలోనే ప్రస్తావించు మన ఆత్మ వేదం మహా కావ్యమైన జ్ఞానమే 
పరమాత్మలోనే విస్తారించు మన ఆత్మ త్యాగం మహా పూర్వమైన కార్యమే   || ఆనందం || 

పరమాత్మలోనే పరిశోధించు మన ఆత్మ శాస్త్రం మహా శూన్యమైన మర్మమే 
పరమాత్మలోనే సంభాషించు మన ఆత్మ శ్రావ్యం మహా సత్యమైన మంత్రమే 

పరమాత్మలోనే విశ్వసించు మన ఆత్మ గుణం మహా నిత్యమైన భావమే 
పరమాత్మలోనే ఆశ్వాసించు మన ఆత్మ కణం మహా భవ్యమైన బంధమే 

పరమాత్మలోనే ఆశ్రయించు మన ఆత్మ స్థానం మహా సర్వమైన శాంతమే 
పరమాత్మలోనే ఆత్రయించు మన ఆత్మ క్షణం మహా పర్వమైన కాంతమే   || ఆనందం ||  

No comments:

Post a Comment