Monday, August 16, 2021

మనస్సు మేధస్సుతో ఉంటుంది

మనస్సు మేధస్సుతో ఉంటుంది 
హృదయ చలనంతో మేధస్సులో మనస్సు భావాలను కలిగిస్తూ ఉంటుంది

ఇంద్రియముల నుండి మనస్సు వివిధ భావాలను కలిగిస్తుంది లేదా మార్చుతుంది
క్షణంలో కలిగే ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలుగా మారుతూ అర్థాన్ని గ్రహిస్తూ ఉంటాయి 
( అర్థం అంటే - ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఏది అవసరం ఏది అనవసరం. ఇలా ఎన్నో మంచి కోసమే గ్రహించాలి. అందరికి మంచి జరిగేలా చూడాలి )
చదవడం కన్నా మంచిని గ్రహించి తెలుసుకోవడం మంచినే ఆచరించి మంచినే చేస్తూ ఉండడం చాలా గొప్ప పరమార్థం 

భావాల అర్థాలను తెలుసుకొనుటకు భావాలు ఆలోచనలుగా సాగుతాయి 
మనస్సు కలిగించే భావాలను ఇంద్రియ గుణాల స్వభావాలతో మేధస్సు ( బుద్ధి, విజ్ఞానం ) అర్థాన్ని గ్రహిస్తుంది 

భావం యొక్క తత్త్వంతో హృదయం స్పందిస్తుంది 
హృదయం స్పందించే విధానంతో మనకు సుఖం సంతోషం దుఃఖం మొదలైనవి కలుగుతాయి 

ఆలోచనల అర్థం కన్నా భావాల అర్థం తెలుసుకుంటే హృదయ స్పందన బాగా తెలుస్తుంది 
హృదయ స్పందన గల వారు మనస్సును సంతోషంగా మార్చుకోగలరు లేదా ఉంచగలరు 
హృదయ స్పందన గల వారు భావార్థంతో మరొకరి మనస్సును సంతోషంగా ఉంచగలరు

హృదయ స్పందన గల వారు ఆలోచనల సూక్ష్మ అర్థాల భావ తత్వాలను గ్రహించగలరు


మనస్సు మేధస్సు హృదయం దేహ ఇంద్రియాలు దేహ ప్రక్రియలతో భావాలు ఆలోచనలు కలుగుతుంటాయి 
ఆలోచనలు వివిధ ఆలోచనల ప్రభావాలతో అర్థాన్ని గ్రహిస్తూ మేధస్సును విజ్ఞానవంతంగా మార్చుతుంటాయి 

ఆలోచనలు అజ్ఞానాన్ని ఆకర్షిస్తే మేధస్సులో అజ్ఞాన ఆలోచనలు పరమార్థాన్ని గ్రహించక మేధస్సు అజ్ఞానంగా మారుతుంది 
మేధస్సు అజ్ఞానమైతే కుటుంబ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు సమాజ సమస్యలు అనేకమై కలుగుతూనే ఉంటాయి 

మేధస్సు విజ్ఞానమైతే ఏ సమస్యకైనా ఆలోచనలు విజ్ఞాన పరిస్కారంతో సత్యమైన మార్గాన్ని చూపుతూ ఉంటాయి

No comments:

Post a Comment