మంచివారికి ఏదైనా ఎంతైనా కల్పించవచ్చు
మంచివారు దేనినైనా సద్వినియోగ పరుచుకోగలరు
మంచివారు ఎప్పటికీ ఇతరులకు మేలు చేయగలరు
మంచివారిని ఆశ్రయిస్తే అందరికి చాలా మంచి జరుగుతుంది
మంచివారిని ప్రోత్సాహించేవారు ఎక్కడా (ఇంట్లో కూడా) ఉండరు
మంచిని ప్రోత్సహించకపోతే మంచిని తెలిపేవారు లభించరు
కాలంతో ఎన్ని మార్పులు వచ్చినా మంచివారు మంచిని విడవలేరు
మంచిని ఆశ్రయిస్తే సమస్యలు పరిమితం పరమానందం
మంచివారి సిద్ధాంతం మానవత్వం సహృదయం మహనీయం
మంచి ఎప్పుడూ సాధారణంగా ఉంటుంది ప్రోత్సహిస్తే బృహత్తరంగా ఉంటుంది
మంచిని గుర్తించి ప్రోత్సహిస్తే అది నీకు మహా గుర్తింపు తెస్తుంది
No comments:
Post a Comment