నా మరణాన్ని ఎక్కడ ఎలాగ ఎవరు నిర్ణయించారు
నా మరణాన్ని ఎందుకు ఎప్పుడు ఏమని నిర్ణయించారు
నా మరణాన్ని ఇక్కడే ఇలాగే ఎవరు నిశ్చయించారు
నా మరణాన్ని ఇందుకే ఇప్పుడే ఏమని నిశ్చయించారు
నా మరణం ఏ భావాన్ని గ్రహించినదో ఏ తత్త్వాన్ని తలచినదో
నా మరణం ఏ రూపాన్ని ఊహించినదో ఏ నాదాన్ని స్వరించినదో || నా మరణాన్ని ||
మరణంతోనే నా మేధస్సులో విజ్ఞానమంతా శూన్యమై నిశ్చలమై పోయెనే
మరణంతోనే నా దేహస్సులో ప్రక్రియమంతా స్థిరమై వికారమై పోయెనే
మరణంతోనే నా మనస్సులో ప్రభావమంతా స్పష్టమై నిర్మలమై పోయెనే
మరణంతోనే నా వయస్సులో విచారమంతా శుద్ధమై విశోధ్యమై పోయెనే
మరణంతోనే నా శిరస్సులో అజ్ఞానమంతా కాంతమై ప్రభాతమై పోయెనే
మరణంతోనే నా శ్రేయస్సులో అకార్యమంతా శాంతమై ప్రభూతమై పోయెనే || నా మరణాన్ని ||
No comments:
Post a Comment