Monday, August 9, 2021

నా మేధస్సులో నిలిచే ఆఖరి భావన ఏది

నా మేధస్సులో నిలిచే ఆఖరి భావన ఏది
నా దేహస్సులో కలిగే చివరి తత్త్వన ఏది

నా మనస్సులో నిలిచే ఆఖరి వేదన ఏది 
నా వయస్సులో కలిగే చివరి స్పందన ఏది 
 
నా శ్రేయస్సులో కలిగే ఆఖరి ఘటన ఏది 
నా ఆయుస్సులో నిలిచే చివరి స్మరణ ఏది

నా శిరస్సులో కలిగే ఆఖరి యోచన ఏది 
నా తేజస్సులో నిలిచే చివరి కల్పన ఏది 

నా మేధస్సులో ధ్యానించే ఆఖరి భావన ఏది 
నా దేహస్సులో శ్వాసించే చివరి తత్త్వన ఏది 

నా మనస్సులో ఊహించే ఆఖరి వేదన ఏది 
నా వయస్సులో ధ్వనించే చివరి స్పందన ఏది 

నా శ్రేయస్సులో శోధించే ఆఖరి ఘటన ఏది 
నా ఆయుస్సులో తపించే చివరి స్మరణ ఏది

నా శిరస్సులో లభించే ఆఖరి యోచన ఏది 
నా తేజస్సులో పూరించే చివరి కల్పన ఏది 

No comments:

Post a Comment