విశ్వమంతా పరమాత్మ నీవే
పరమాత్మలో ఓ ఆత్మవు నీవే
ఆత్మతో ఒదిగే ఓ జీవం నీవే
జీవంతో ఎదిగే ఓ దేహం నీవే
దేహంతో ఉదయించే ఓ రూపం నీవే
రూపంతో విజ్ఞానించే ఓ మేధస్సు నీవే
మేధస్సులో కలిగే అనేక భావనలు నీవే
భావాలలో వెలిగే అనేక అర్థములు నీవే
అర్థాలనే ఆలోచనల కార్యాలుగా సాగించేది నీవే
కార్యాలనే ఆలోచనల తత్వాలుగా తపించేది నీవే
తత్వాలతో సాగే నీ దేహాత్మ భావ రూప జీవం మహాత్మ పరమాత్మ పరమార్థంతో యదార్థంగా విశ్వానికి అందించేది నీవే || విశ్వమంతా ||
పర ఆత్మంతో వెలిసిన నీవు పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా ఆలోచిస్తూ పరమార్ధంతో సంభాషిస్తూ పరిపూర్ణంగా జీవించలేవా
పర సంజ్ఞకంతో కలిసిన నీవు పవిత్రతంగా పర్యాయంగా పరిశోధిస్తూ ప్రాణార్థంతో సుభాషిస్తూ పరిపూర్వంగా నివసించలేవా || విశ్వమంతా ||
పరమాత్మంతో ఉద్భవించిన నీవు పదార్థంగా పద్యార్థకరంగా అన్వేషిస్తూ పరధ్యానంతో పరధ్యాయంతో పద్మకల్పంగా నిలువలేవా
పరధాత్మంతో ప్రభవించిన నీవు ప్రఖ్యాతంగా ప్రావీణ్యంగా పర్వేషిస్తూ పరత్యాగంతో పవిత్రణంతో ప్రభూతసాయంగా విలువలేవా || విశ్వమంతా ||
No comments:
Post a Comment