విజయం ఎటువైపు ఉన్నా ప్రయాణం అటు వైపేనా
జీవనం ఎటువైపు ఉన్నా శ్రమించడం అటు వైపేనా
గమనం ఎటువైపు ఉన్నా చలనం అటు వైపేనా
స్మరణం ఎటువైపు ఉన్నా శరణం అటు వైపేనా
భావనం ఎటువైపు ఉన్నా తత్త్వనం అటు వైపేనా
విజ్ఞానం ఎటువైపు ఉన్నా వేదాంతం అటు వైపేనా
సాధనం ఎటువైపు ఉన్నా సహనం అటు వైపేనా
సంకల్పం ఎటువైపు ఉన్నా సామర్థ్యం అటు వైపేనా
ఉదయం ఎటువైపు ఉన్నా ఉత్తేజం అటు వైపేనా
సమయం ఎటువైపు ఉన్నా సంభవం అటు వైపేనా
కారణం ఎటువైపు ఉన్నా ఫలితం అటు వైపేనా
ఆచరణం ఎటువైపు ఉన్నా ఆశ్రయం అటు వైపేనా
సంస్కారం ఎటువైపు ఉన్నా పరిష్కారం అటు వైపేనా
సుభాషితం ఎటువైపు ఉన్నా సంబోధనం అటు వైపేనా
వినయం ఎటువైపు ఉన్నా వివేకం అటు వైపేనా
విషయం ఎటువైపు ఉన్నా వివరణం అటు వైపేనా
సమాజం ఎటువైపు ఉన్నా సమాచారం అటు వైపేనా
ప్రచారం ఎటువైపు ఉన్నా ప్రస్తావనం అటు వైపేనా
అద్భుతం ఎటువైపు ఉన్నా ఆశ్చర్యం అటు వైపేనా
అమృతం ఎటువైపు ఉన్నా అమరం అటు వైపేనా
No comments:
Post a Comment