ఓ మహా వృక్షమా! నీవు జీవించిన శతాబ్దాల సమయమంతా వృధాగా మారుతున్నది
ఓ మహా వృక్షమా! నీవు ఎదిగిన దశాబ్దాల కాలత్రయమంతా నిష్ప్రయోజన మౌతున్నది
రహదారి మధ్యలో వెలసినందుకే నీకు యుగాలుగా జీవించే అర్హత సాగించలేక పోతున్నది
గృహదారి మధ్యలో ఎగసినందుకే నీకు తరాలుగా సాగించే స్తోమత పొడగించలేక పోతున్నది
నీవు జీవించుటలో ఎన్నో లక్షల జీవులకు ప్రాణ వాయువును అద్భుత ఔషధంగా అందిస్తున్నావు
నీవు జీవించుటలో ఎన్నో లక్షల జీవులకు విశ్వ వాయువును అద్భుత మూలికంగా అర్పిస్తున్నావు
వెళ్ళిన తరాలకు రాబోయే తరాలకు రక్షణగా ఉన్న నీ జీవితం నేటితో వృధాగా మారిపోయినది
వెళ్ళిన తరాలకు రాబోయే తరాలకు పోషణగా ఉన్న నీ జీవనం నేటితో వ్యర్థంగా మారిపోతున్నది
ప్రపంచమంతా ఎన్నో రకాలుగా ఎన్నో వృక్షాలను మానవ నిర్మాణములకై నీలాగే తొలగిస్తున్నారు
ప్రపంచమంతా ఎన్నో విధాలుగా ఎన్నో వృక్షాలను మానవ కట్టడములకై నీలాగే త్రుంచేస్తున్నారు
నీవు లేని జీవితాలు అనారోగ్యంతో వైద్యశాలలకు చికిత్సకై పరుగులు తీస్తూ అలసి సొలసి పోతున్నారు
నీవు లేని జీవితాలు అష్టకష్టాలతో ఆరోగ్యశాలలకు ప్రక్రియకై ఉరకలు వేస్తూ అరచి తొలచి పోతున్నారు
నీవు లేని ఊరట నిలకడ లేని జీవన విధానం నీవు లేని ధీరత సరైన ఆలోచన లేని సమయంతో నిష్ప్రయోజనం
నీవు లేని ఓపిక సహనం లేని జీవన విషాదం నీవు లేని స్తోమత సరైన ఆచరణ లేని సందర్భంతో అప్రయోజనం
నీవులేని పర్యావరణం కాలుష్యమైన జీవన విధానం కృత్రిమమైన సాధన వ్యాయామం అసాధారణ జీవితం
నీవులేని వాతావరణం కలుషితమైన జీవన విధానం కల్పితమైన సాధన అభ్యాసం అసామాన్యమైన జీవితం
విశ్రాంతి లేని ఉష్ణత ఉష్ణోగ్రతకే తీవ్రత భూ ఆవరణానికే కవోష్టత మొక్కలతోనే సూక్ష్మ ప్రాణ వాయువులకై కృత్రిమ జ్ఞాన అప్రకృత ప్రణాళిక
సూర్యకాంతి లేని ఉష్ణత ఉష్ణ తీవ్రతకు ఎండుతున్న వృక్షాల సంఖ్యత పర్యావరణాన్ని రక్షించలేని ప్రదేశాలలో మొక్కలతో అకాల ప్రణాళిక
విత్తనం లేని మహా వృక్షమా నీవు లేని [లేక] మరో వృక్షం వెలిసేదెలా
విత్తనమే ఉన్నా [సరైన ప్రదేశంలో] నిన్ను వృక్షమయ్యే వరకు రక్షిస్తూ పోషించెదవరూ