Friday, October 11, 2024

అనారోగ్యం ఎదుగుతుంటే ఐశ్వర్యం తరుగుతుంటుంది

అనారోగ్యం ఎదుగుతుంటే ఐశ్వర్యం తరుగుతుంటుంది 
ఆరోగ్యం ఎదుగుతుంటే ఐశ్వర్యం ఎదుగుతుంటుంది 

అనారోగ్యాన్ని త్వరగా వదిలించుకో ఐశ్వర్యాన్ని త్వరగా అభివృద్ధి చేసుకో 

ఎంతగా శ్రమిస్తున్నా శరీరానికి అంతగా ఆరోగ్యం అవసరం 
ప్రతి జీవికి శ్రమతో పాటు శాంతం ప్రశాంతం విశ్రాంతం అవసరం 

శ్రమకు తగ్గ ప్రతి ఫలాన్ని అందుకుంటే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం ఎదుగుతుంది 
శ్రమలో నైపుణ్యాన్ని గమనిస్తూ కార్యాలను వివేకవంతమైన సామర్థ్యంతో సాగిస్తే ప్రతిఫలం అధికంగా లభిస్తుంది 

ప్రతి మానవుడు శ్రమించడంతో పాటు విజ్ఞానంగా ఎదుగుతూ ప్రతిఫలంతో కూడిన కార్యాలను చేస్తూ సాగాలి 
ప్రతిఫలం ఎక్కువగా ఉన్న చోట ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం విజ్ఞానం ఆనంద సంతోషాలు సాగిపోతూ ఉండాలి 


 

No comments:

Post a Comment