Monday, October 14, 2024

మాట్లాడలేకపోయినా మహా గొప్పగా ఆలోచిస్తున్నా చెప్పలేకపోయినా మహా గొప్పగా వ్రాయగలుగుతున్నా

మాట్లాడలేకపోయినా మహా గొప్పగా ఆలోచిస్తున్నా చెప్పలేకపోయినా మహా గొప్పగా వ్రాయగలుగుతున్నా  

వినలేనివారు చదువుతూ ఏదైనా తెలుసుకోగలరు చూడలేనివారు వింటూ అవగాహనతో తెలుసుకోగలరు 

వినలేనివారు చదవాలంటే అక్షరాలను గుర్తించే విధంగా వాటిని శబ్ద పరిచే విధంగా మనం వారికి నేర్పించాలి 
అక్షరాలను గుర్తిస్తూ అక్షరాల శబ్దాలు పలికే విధానం వస్తే పదాలను అలాగే వాక్యాలను చదవటం నేర్చుకుంటారు 

వినలేని వారికి చూడలేని వారికి చదవటం నేర్పించాలంటే ఎన్నో రకాల విధానాలను తెలుసుకోవాలి ఎన్నో ప్రయోగాలు చేయాలి 
శిక్షణ విధానాలను వాటి శబ్దాల ఉచ్చారణ భావ తత్త్వాలను అర్థమయ్యేలా తెలిపేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించాలి 

వివిధ రకాల పరికరాలతో వస్తువులతో వాటి పేర్లతో ఉపయోగాలతో నటిస్తూ వాడటం చూపిస్తూ పదాలుగా వాక్యాలుగా తెలపాలి 

దేహ భావాల తత్త్వాలతో జీవన విధానాలతో ఎన్నో రకాలుగా ఉన్నతంగా ప్రజ్ఞానంతో తెలుపుతూ ప్రయత్నిస్తూ హితంతో నేర్పించాలి 


No comments:

Post a Comment