శ్రీమంతుడైనా ఐశ్వర్యవంతుడైనా సహాయ గుణం ఉంటేనే ప్రయోజనం
కార్మికుల నిరంతర శ్రమతో ఎదుగుతూ శ్రీమంతుడిగా ఐశ్వర్యవంతుడిగా మారిన నీవు కార్మికులకు ఏనాడైనా ఊరట కలిగించావా ఏనాడైనా జీత భత్యాలను సంతోసించేలా అందించగలవా [అందించావా అందిస్తున్నావా] కలిపించగలవా [కలిపించావా కలిపిస్తున్నావా] ఆలోచించగలవా [ఆలోచించావా ఆలోచిస్తున్నావా]
ఒక్కడే జీవితాంతం నిరంతరం శ్రమిస్తే శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు కాగలవా
నీ శ్రమలో అనారోగ్యమైతే నీవు ఏ స్థానంలో ఉండగలవు నీవు ఒక కార్మికుడివిగానే జీవిస్తూ మిగిలిపోగలవూ
శ్రీమంతుడిగా ఎదిగినవారు శ్రీమంతుడు కారు శ్రీమంతుడిగా ఎదుగుటలో శ్రమించినవారే సత్యమైన శ్రీమంతులు
శ్రమ లేనిదే ఫలితం లేదు కార్మికులు లేనిదే శ్రీమంతులు లేరు
అధికారులు శ్రీమంతులు కాగలరు విజ్ఞానులు శ్రీమంతులు కాగలరు
సహాయ గుణం కలవారే సత్యమైన శ్రీమంతులు ఐశ్వర్యవంతులు అవుతారు
కార్మికుల శ్రమకు సరైన ఫలితాన్ని అందించు ప్రోత్సాహించు వారి కుటుంబాలకు ఊరట కలిగించు
No comments:
Post a Comment