కనిపించే ప్రతి అణువులను ఏ జీవి చూడగలదు
కనిపించే దృశ్యం అణువుల సముదాయమైనా చూసే వాటిలో కొన్ని రూపాలనే గమనిస్తూ ప్రయాణిస్తాం
కనిపించే వాటిలో మనం చూసేదంతా కొన్ని అణువుల ప్రతి బింబాల చిత్ర రూపాల వివిధ రకాల సముదాయమే
మనం చూసే వివిధ రూపాలలో వాటిలో కొన్నింటిని గుర్తించుకుంటాం కొన్నింటిని గమనిస్తాం కొన్నింటిని మరచిపోతాం కొన్నింటిని పరిశీలిస్తాం కొన్నింటిని జ్ఞాపకం చేసుకుంటాం కొన్నింటిని గమనించకుండానే వెళ్ళిపోతాం కొన్నింటిని చూస్తూ తప్పుకుంటాం కొన్నింటిని పదే పదే చూస్తాం కొన్నింటిని కాస్త సమయం ఆలోచిస్తూనే ఉంటాం
చూసిన వాటిలో జ్ఞానాన్ని అజ్ఞానాన్ని గమనిస్తూ నేర్చుకుంటూ అర్థం చేసుకుంటూ సాగిపోతాం
No comments:
Post a Comment