Friday, September 8, 2017

ఎంతగా నీవు ఎదిగావో అంతగా నీవు ఒదిగావో

ఎంతగా నీవు ఎదిగావో అంతగా నీవు ఒదిగావో
ఎంతగా నీవు నేర్చావో అంతగా నీవు ఓర్చావో

ఎంతగా నీవు ప్రయాణించావో అంతగా నీవు అన్వేషించావో
ఎంతగా నీవు ప్రయత్నించావో అంతగా నీవు అనుభవించావో   || ఎంతగా ||

సూర్యునిచే ఎంత ఎదిగినా ప్రకృతిచే అంతే ఒదిగిపో
ప్రకృతిచే ఎంత ఎదిగినా సూర్యునిచే అంతే ఒదిగిపో

విజ్ఞానంచే ఎంత ఎదిగినా వేదాంతంచే అంతే ఒదిగిపో
వేదాంతంచే ఎంత ఎదిగినా విజ్ఞానంచే అంతే ఒదిగిపో    || ఎంతగా ||

భావాలతో ఎంత ఎదిగినా తత్వాలతో అంతే ఒదిగిపో
తత్వాలతో ఎంత ఎదిగినా భావాలతో అంతే ఒదిగిపో

సత్యంతో ఎంత ఎదిగినా ధర్మంతో అంతే ఒదిగిపో
ధర్మంతో ఎంత ఎదిగినా సత్యంతో అంతే ఒదిగిపో    || ఎంతగా || 

No comments:

Post a Comment