Sunday, June 2, 2019

ఓ మహా దేవా! నీవైనా అజ్ఞానాన్ని కలిగించవా

ఓ మహా దేవా! నీవైనా అజ్ఞానాన్ని కలిగించవా
ఓ ప్రభు దేవా! నీవైనా అనర్థాన్ని నడిపించవా
ఓ గురు దేవా! నీవైనా అనిష్టము చూపించవా
ఓ జయ దేవా! నీవైనా అర్ధాంతము చేకూర్చవా

విజయమే లేని నా విజ్ఞానము నాకు నిత్యం నిష్ప్రయోజనమే
సంతోషమే లేని నా వేదాంతము నాకు సర్వం నిరర్థకారణమే   || ఓ మహా దేవా! ||

అజ్ఞానం అఖండమై కార్యములన్నియు అపజయంతో సాగిపోతున్నాయి
అనర్థం అమోఘమై కార్యములన్నియు అపార్థంతో జరిగిపోతున్నాయి
అనిష్టం అభిన్నమై కార్యములన్నియు అస్వస్థతతో వెళ్ళిపోతున్నాయి
అర్ధాంతం అమరమై కార్యములన్నియు అజాగ్రతతో చెదిరిపోతున్నాయి

విజయం కలిగే వరకు నా కార్యములు సప్త సముద్రాలతో పోరాడుతుంటాయి  || ఓ మహా దేవా! ||

అజ్ఞానం అనివార్యమై కార్యములన్నియు అధ్యాయంతో సాగిపోతున్నాయి
అనర్థం అనంతమై కార్యములన్నియు అన్వేషణతో జరిగిపోతున్నాయి
అనిష్టం అపారమై కార్యములన్నియు అప్రమత్తతతో వెళ్ళిపోతున్నాయి 
అర్ధాంతం ఆద్యంతమై కార్యములన్నియు అవిశ్వాసంతో చెదిరిపోతున్నాయి 

మరణం కలిగే వరకు నా కార్యములు విశ్వ వేదాలతో లిఖింపబడుతుంటాయి  || ఓ మహా దేవా! ||

No comments:

Post a Comment