Monday, June 17, 2019

విశ్వమే నీవని వేదమే తెలిపెను

విశ్వమే నీవని వేదమే తెలిపెను
జగమే నీవని జ్ఞానమే తెలిపెను

వేదమే నీవని కాలమే తెలిపెను
జ్ఞానమే నీవని మోహమే తెలిపెను

సర్వం నీవని భావమే తెలిపెను
నిత్యం నీవని తత్వమే తెలిపెను

భావమే నీవని బంధమే తెలిపెను
తత్వమే నీవని జీవమే తెలిపెను

మనస్సే నీవని శ్వాసే తెలిపెను
వయస్సే నీవని ధ్యాసే తెలిపెను

శ్వాసే నీవని యోగమే తెలిపెను
ధ్యాసే నీవని భోగమే తెలిపెను

గమనమే నీవని దేహమే తెలిపెను
చలనమే నీవని దైవమే తెలిపెను

దేహమే నీవని ప్రకృతి తెలిపెను
దైవమే నీవని జాగృతి తెలిపెను 

No comments:

Post a Comment