Monday, June 17, 2019

నీ ప్రయాణాలే ఒక యోగమని నీ దేహానికి తెలుపవా

నీ ప్రయాణాలే ఒక యోగమని నీ దేహానికి తెలుపవా
నీ ఉచ్చ్వాసాలే ఒక భోగమని నీ ఆలోచనకు తెలుపవా

నీ శ్వాస గమనమే మహా యోగమని నీ దేహానికి తెలుపవా
నీ ధ్యాస చలనమే మహా భోగమని నీ ఆలోచనకు తెలుపవా 

జీవితమే ఒక యోగ భోగ ప్రయాణమని ప్రతి జీవికి నీవే తెలుపవా  || నీ ప్రయాణమే ||

జీవించుటలో ప్రయాణం ఒక యోగ ధ్యాన సిద్ధియే
శ్వాసించుటలో చలనం ఒక భోగ ధ్యాస ప్రసిద్ధియే

ఆలోచించుటలో దేహం ఒక మహా యోగ సామర్థ్యమే
ధ్యానించుటలో జీవం ఒక మహా భోగ సంభూతయమే  || నీ ప్రయాణమే ||

ప్రయాణించుటలో నీ జీవం ఒక యోగ భావ ప్రశాంతమే
తిలకించుటలో నీ రూపం ఒక భోగ తత్వ పరివర్తనమే

దర్శించుటలో నీ దేహం ఒక మహా ధ్యాన దైవ పరిశుద్ధమే
ఆశ్రయించుటలో నీ వేదం ఒక మహా ధ్యాస దివ్య ప్రజ్ఞానమే  || నీ ప్రయాణమే ||  

No comments:

Post a Comment