Thursday, August 19, 2021

ఏ లిపి భాషతో ఏది ఎంత నేర్చినావు

ఏ లిపి భాషతో ఏది ఎంత నేర్చినావు 
ఏ లిపి భాషతో ఏది ఎంత చేర్చినావు 

ఏ లిపి భాషతో ఏది ఎంత తెచ్చినావు 
ఏ లిపి భాషతో ఏది ఎంత మెచ్చినావు 

ఏ లిపి భాషతో ఏది ఎంత ఇచ్చినావు 
ఏ లిపి భాషతో ఏది ఎంత తీర్చినావు 

ఏ లిపి భాషతో ఏది ఎంత శ్రమించినావు 
ఏ లిపి భాషతో ఏది ఎంత ఆర్జించినావు 

ఏ లిపి భాషతో ఏది ఎంత ఎదిగినావు 
ఏ లిపి భాషతో ఏది ఎంత ఒదిగినావు 

ఏ లిపి భాషలో ఎంత ఎదిగినా అంతగా ఒదగవా 
ఏ లిపి భాషలో ఎంత తరిగినా అంతగా వర్ధిల్లవా

ప్రతి భాష నీ విజ్ఞానం ప్రతి శ్వాస నీ ప్రజ్ఞానం 
ప్రతి మాట నీ సుజ్ఞానం ప్రతి ధ్యాస నీ స్వజ్ఞానం 

దేహానికే దైవం రూపానికే రమ్యం జీవానికే జన్మం మరణంతో శూన్యం గాంచినది

దేహానికే దైవం రూపానికే రమ్యం జీవానికే జన్మం మరణంతో శూన్యం గాంచినది
భావానికే బంధం తత్వానికే తంత్రం స్పందనకే సౌమ్యం మరణంతో శూన్యం గాంచినది

లోకానికే లౌక్యం విశ్వానికే వైనం జగానికే జనం మరణంతో శూన్యం గాంచినది
స్థానానికే స్థైర్యం జ్ఞానానికే జ్ఞాతం వేదానికి వస్త్రం మరణంతో శూన్యం గాంచినది

మరణంతో శాశ్వితం శూన్యమై ఉదయంతో ఉద్భవించునా నీ హృదయ జీవ రూపం 
పతనంతో శాశ్వితం శూన్యమై ఆరంభంతో ఆవిర్భవించునా నీ మధుర భావ తత్త్వం 

విడిచినది ఆత్మ పర బ్రంహం అడగలేని పర బ్రంహ ప్రసాదం
మరచినది జ్ఞాన పర బ్రంహం తెలుపలేని వేద బ్రంహ ప్రమాణం

జన్మంతో పర బ్రంహ విజ్ఞాన సంభూత పరిశోధనం 
అంతంతో పర బ్రంహ కర్తవ్య సంసిద్ధ పర్యాయతః

మంచివారికి ఏదైనా ఎంతైనా కల్పించవచ్చు

మంచివారికి ఏదైనా ఎంతైనా కల్పించవచ్చు 
మంచివారు దేనినైనా సద్వినియోగ పరుచుకోగలరు 
మంచివారు ఎప్పటికీ ఇతరులకు మేలు చేయగలరు 
మంచివారిని ఆశ్రయిస్తే అందరికి చాలా మంచి జరుగుతుంది 

మంచివారిని ప్రోత్సాహించేవారు ఎక్కడా (ఇంట్లో కూడా) ఉండరు 
మంచిని ప్రోత్సహించకపోతే మంచిని తెలిపేవారు లభించరు
కాలంతో ఎన్ని మార్పులు వచ్చినా మంచివారు మంచిని విడవలేరు 

మంచిని ఆశ్రయిస్తే సమస్యలు పరిమితం పరమానందం 
మంచివారి సిద్ధాంతం మానవత్వం సహృదయం మహనీయం 

మంచి ఎప్పుడూ సాధారణంగా ఉంటుంది ప్రోత్సహిస్తే బృహత్తరంగా ఉంటుంది 

మంచిని గుర్తించి ప్రోత్సహిస్తే అది నీకు మహా గుర్తింపు తెస్తుంది

Monday, August 16, 2021

మనస్సు మేధస్సుతో ఉంటుంది

మనస్సు మేధస్సుతో ఉంటుంది 
హృదయ చలనంతో మేధస్సులో మనస్సు భావాలను కలిగిస్తూ ఉంటుంది

ఇంద్రియముల నుండి మనస్సు వివిధ భావాలను కలిగిస్తుంది లేదా మార్చుతుంది
క్షణంలో కలిగే ఎన్నో భావాలు ఎన్నో ఆలోచనలుగా మారుతూ అర్థాన్ని గ్రహిస్తూ ఉంటాయి 
( అర్థం అంటే - ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఏది అవసరం ఏది అనవసరం. ఇలా ఎన్నో మంచి కోసమే గ్రహించాలి. అందరికి మంచి జరిగేలా చూడాలి )
చదవడం కన్నా మంచిని గ్రహించి తెలుసుకోవడం మంచినే ఆచరించి మంచినే చేస్తూ ఉండడం చాలా గొప్ప పరమార్థం 

భావాల అర్థాలను తెలుసుకొనుటకు భావాలు ఆలోచనలుగా సాగుతాయి 
మనస్సు కలిగించే భావాలను ఇంద్రియ గుణాల స్వభావాలతో మేధస్సు ( బుద్ధి, విజ్ఞానం ) అర్థాన్ని గ్రహిస్తుంది 

భావం యొక్క తత్త్వంతో హృదయం స్పందిస్తుంది 
హృదయం స్పందించే విధానంతో మనకు సుఖం సంతోషం దుఃఖం మొదలైనవి కలుగుతాయి 

ఆలోచనల అర్థం కన్నా భావాల అర్థం తెలుసుకుంటే హృదయ స్పందన బాగా తెలుస్తుంది 
హృదయ స్పందన గల వారు మనస్సును సంతోషంగా మార్చుకోగలరు లేదా ఉంచగలరు 
హృదయ స్పందన గల వారు భావార్థంతో మరొకరి మనస్సును సంతోషంగా ఉంచగలరు

హృదయ స్పందన గల వారు ఆలోచనల సూక్ష్మ అర్థాల భావ తత్వాలను గ్రహించగలరు


మనస్సు మేధస్సు హృదయం దేహ ఇంద్రియాలు దేహ ప్రక్రియలతో భావాలు ఆలోచనలు కలుగుతుంటాయి 
ఆలోచనలు వివిధ ఆలోచనల ప్రభావాలతో అర్థాన్ని గ్రహిస్తూ మేధస్సును విజ్ఞానవంతంగా మార్చుతుంటాయి 

ఆలోచనలు అజ్ఞానాన్ని ఆకర్షిస్తే మేధస్సులో అజ్ఞాన ఆలోచనలు పరమార్థాన్ని గ్రహించక మేధస్సు అజ్ఞానంగా మారుతుంది 
మేధస్సు అజ్ఞానమైతే కుటుంబ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు సమాజ సమస్యలు అనేకమై కలుగుతూనే ఉంటాయి 

మేధస్సు విజ్ఞానమైతే ఏ సమస్యకైనా ఆలోచనలు విజ్ఞాన పరిస్కారంతో సత్యమైన మార్గాన్ని చూపుతూ ఉంటాయి

విశ్వమంతా పరమాత్మ నీవే

విశ్వమంతా పరమాత్మ నీవే 
పరమాత్మలో ఓ ఆత్మవు నీవే 

ఆత్మతో ఒదిగే ఓ జీవం నీవే 
జీవంతో ఎదిగే ఓ దేహం నీవే 

దేహంతో ఉదయించే ఓ రూపం నీవే 
రూపంతో విజ్ఞానించే ఓ మేధస్సు నీవే 

మేధస్సులో కలిగే అనేక భావనలు నీవే 
భావాలలో వెలిగే అనేక అర్థములు నీవే 

అర్థాలనే ఆలోచనల కార్యాలుగా సాగించేది నీవే 
కార్యాలనే ఆలోచనల తత్వాలుగా తపించేది నీవే 

తత్వాలతో సాగే నీ దేహాత్మ భావ రూప జీవం మహాత్మ పరమాత్మ పరమార్థంతో యదార్థంగా విశ్వానికి అందించేది నీవే   || విశ్వమంతా ||  

పర ఆత్మంతో వెలిసిన నీవు పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా ఆలోచిస్తూ పరమార్ధంతో సంభాషిస్తూ పరిపూర్ణంగా జీవించలేవా 
పర సంజ్ఞకంతో కలిసిన నీవు పవిత్రతంగా పర్యాయంగా పరిశోధిస్తూ ప్రాణార్థంతో సుభాషిస్తూ పరిపూర్వంగా నివసించలేవా   || విశ్వమంతా || 

పరమాత్మంతో ఉద్భవించిన నీవు పదార్థంగా పద్యార్థకరంగా అన్వేషిస్తూ పరధ్యానంతో పరధ్యాయంతో పద్మకల్పంగా నిలువలేవా 
పరధాత్మంతో ప్రభవించిన నీవు ప్రఖ్యాతంగా ప్రావీణ్యంగా పర్వేషిస్తూ పరత్యాగంతో పవిత్రణంతో ప్రభూతసాయంగా విలువలేవా    || విశ్వమంతా || 

Wednesday, August 11, 2021

విశ్వానికి మానవుడు అవసరం (లేదు!) (ఎంత) నిర్ణయించేది ఎవరు?

విశ్వానికి మానవుడు అవసరం (లేదు!) (ఎంత) నిర్ణయించేది ఎవరు?

విశ్వానికి మానవ జీవత్వం అవసరం ఉందా లేదా 
విశ్వానికి మానవ విజ్ఞానం అజ్ఞానం ఎంతవరకు ఎలా అవసరం 
విశ్వానికి మానవ జీవన విధానం ఎలా ఉపయోగపడుతుంది 
విశ్వానికి మానవ మేధస్సు ఎలా ఉపయోగం ఎలా అవసరం 
విశ్వానికి మానవ అజ్ఞానం ఎలాంటి మార్పును కలిగిస్తుంది 

మానవునికి విజ్ఞానం ఉన్నా అజ్ఞానంతో ఎలా జీవిస్తున్నాడు 
మానవునికి విజ్ఞానం ఉన్నా అజ్ఞానమే అతిశయోక్తిగా మారుతున్నదా 
మానవునికి విజ్ఞాన సమయం అజ్ఞాన సమయం కన్నా తక్కువనా 

మానవుడు విశ్వంలో ఎలా అవతరించాడు? అవతరిస్తే అతని మేధస్సు ఎందుకు?
మానవ రూపం గొప్పతనమైతే మానవ మేధస్సును విజ్ఞానంగా మాత్రమే ఎందుకు మార్చుకోరాదు 
మానవుడు ఆరోగ్యంతో ఉదయిస్తే అనారోగ్యంతో ఎందుకు జీవిస్తున్నాడు - కారణం పరిస్థితుల ప్రభావమా అజ్ఞానమా 

విశ్వమంతా అన్వేషించి పరిశోధించి నేర్చిన విజ్ఞానం సక్రమంగా సాగేలా ఎవరు పర్యవేక్షిస్తారు 
విశ్వమంతా అవతరించిన సకల జీవరాశులు మానవ విజ్ఞానానికి ఎలా ఉపయోగపడుతున్నాయి 

Tuesday, August 10, 2021

నా మరణాన్ని ఎక్కడ ఎలాగ ఎవరు నిర్ణయించారు

నా మరణాన్ని ఎక్కడ ఎలాగ ఎవరు నిర్ణయించారు
నా మరణాన్ని ఎందుకు ఎప్పుడు ఏమని నిర్ణయించారు

నా మరణాన్ని ఇక్కడే ఇలాగే ఎవరు నిశ్చయించారు
నా మరణాన్ని ఇందుకే ఇప్పుడే ఏమని నిశ్చయించారు

నా మరణం ఏ భావాన్ని గ్రహించినదో ఏ తత్త్వాన్ని తలచినదో 
నా మరణం ఏ రూపాన్ని ఊహించినదో ఏ నాదాన్ని స్వరించినదో               || నా మరణాన్ని || 

మరణంతోనే నా మేధస్సులో విజ్ఞానమంతా శూన్యమై నిశ్చలమై పోయెనే 
మరణంతోనే నా దేహస్సులో ప్రక్రియమంతా స్థిరమై వికారమై పోయెనే       

మరణంతోనే నా మనస్సులో ప్రభావమంతా స్పష్టమై నిర్మలమై పోయెనే 
మరణంతోనే నా వయస్సులో విచారమంతా శుద్ధమై విశోధ్యమై పోయెనే 

మరణంతోనే నా శిరస్సులో అజ్ఞానమంతా కాంతమై ప్రభాతమై పోయెనే 
మరణంతోనే నా శ్రేయస్సులో అకార్యమంతా శాంతమై ప్రభూతమై పోయెనే   || నా మరణాన్ని || 

Monday, August 9, 2021

నా మేధస్సులో నిలిచే ఆఖరి భావన ఏది

నా మేధస్సులో నిలిచే ఆఖరి భావన ఏది
నా దేహస్సులో కలిగే చివరి తత్త్వన ఏది

నా మనస్సులో నిలిచే ఆఖరి వేదన ఏది 
నా వయస్సులో కలిగే చివరి స్పందన ఏది 
 
నా శ్రేయస్సులో కలిగే ఆఖరి ఘటన ఏది 
నా ఆయుస్సులో నిలిచే చివరి స్మరణ ఏది

నా శిరస్సులో కలిగే ఆఖరి యోచన ఏది 
నా తేజస్సులో నిలిచే చివరి కల్పన ఏది 

నా మేధస్సులో ధ్యానించే ఆఖరి భావన ఏది 
నా దేహస్సులో శ్వాసించే చివరి తత్త్వన ఏది 

నా మనస్సులో ఊహించే ఆఖరి వేదన ఏది 
నా వయస్సులో ధ్వనించే చివరి స్పందన ఏది 

నా శ్రేయస్సులో శోధించే ఆఖరి ఘటన ఏది 
నా ఆయుస్సులో తపించే చివరి స్మరణ ఏది

నా శిరస్సులో లభించే ఆఖరి యోచన ఏది 
నా తేజస్సులో పూరించే చివరి కల్పన ఏది 

Thursday, August 5, 2021

విజయం ఎటువైపు ఉన్నా ప్రయాణం అటు వైపేనా

విజయం ఎటువైపు ఉన్నా ప్రయాణం అటు వైపేనా 
జీవనం ఎటువైపు ఉన్నా శ్రమించడం అటు వైపేనా

గమనం ఎటువైపు ఉన్నా చలనం అటు వైపేనా
స్మరణం ఎటువైపు ఉన్నా శరణం అటు వైపేనా

భావనం ఎటువైపు ఉన్నా తత్త్వనం అటు వైపేనా
విజ్ఞానం ఎటువైపు ఉన్నా వేదాంతం అటు వైపేనా

సాధనం ఎటువైపు ఉన్నా సహనం అటు వైపేనా
సంకల్పం ఎటువైపు ఉన్నా సామర్థ్యం అటు వైపేనా

ఉదయం ఎటువైపు ఉన్నా ఉత్తేజం అటు వైపేనా
సమయం ఎటువైపు ఉన్నా సంభవం అటు వైపేనా

కారణం ఎటువైపు ఉన్నా ఫలితం అటు వైపేనా
ఆచరణం ఎటువైపు ఉన్నా ఆశ్రయం అటు వైపేనా

సంస్కారం ఎటువైపు ఉన్నా పరిష్కారం అటు వైపేనా
సుభాషితం ఎటువైపు ఉన్నా సంబోధనం అటు వైపేనా 

వినయం ఎటువైపు ఉన్నా వివేకం అటు వైపేనా
విషయం ఎటువైపు ఉన్నా వివరణం అటు వైపేనా 

సమాజం ఎటువైపు ఉన్నా సమాచారం అటు వైపేనా
ప్రచారం ఎటువైపు ఉన్నా ప్రస్తావనం అటు వైపేనా

అద్భుతం ఎటువైపు ఉన్నా ఆశ్చర్యం అటు వైపేనా
అమృతం ఎటువైపు ఉన్నా అమరం అటు వైపేనా

Wednesday, August 4, 2021

ఆచార్యా! విశ్వమంతా నీ పలుకులతో సుగుణాలను బోధించవా

ఆచార్యా! విశ్వమంతా నీ పలుకులతో సుగుణాలను బోధించవా
ఆచార్యా! జగమంతా నీ అలుకులతో సువర్ణాలను శోధించవా 

ఆచార్యా! లోకమంతా నీ కవితలతో సుకార్యాలను వర్ణించవా 
ఆచార్యా! స్థలమంతా నీ సవితలతో సుభావాలను పూరించవా    

వెలుగులే లేని దిక్కులలో నీవే దివిటివై దిక్సూచిలా బ్రంహాండాన్ని అణువణువునా ప్రతి క్షణం విజ్ఞానంతో నడిపించవా   || ఆచార్యా! || 

ప్రకృతిని పులకించే ప్రభాపత్వికుడు నీవే ఆచార్య 
జగతిని జళికించే జగపత్వికుడు నీవే ఆచార్య 

విశ్వతిని వివరించే విజ్ఞాపత్వికుడు నీవే ఆచార్య 
లోకతిని లాభరించే లీలాపత్వికుడు నీవే ఆచార్య 

భారతిని బంధువించే భాగ్యపత్వికుడు నీవే ఆచార్య 
సుమతిని సుందరించే సుధాపత్వికుడు నీవే ఆచార్య 

ఆకృతిని ఆలకించే అధిపత్వికుడు నీవే ఆచార్య 
శుభతిని శుభవించే శోభాపత్వికుడు నీవే ఆచార్య 

పర్యేషించి పరిశోధించే పరిశుద్ధమైన పర్యాటకుడు ప్రతిభావంతుడు నీవే ఆచార్య   || ఆచార్యా! || 

శాంతృతిని శాంతవించే శాంతపత్వికుడు నీవే ఆచార్య 
సంస్కృతిని సంతరించే సంధ్యాపత్వికుడు నీవే ఆచార్య 

ప్రణతిని ప్రఖ్యాతించే ప్రజాపత్వికుడు నీవే ఆచార్య 
వినతిని విఖ్యాతించే విద్యాపత్వికుడు నీవే ఆచార్య 

స్రవంతిని స్వచ్చతించే సౌఖ్యపత్వికుడు నీవే ఆచార్య 
మహంతిని మాన్యతించే మహాపత్వికుడు నీవే ఆచార్య

సురతిని సంపూర్తించే సిఖాపత్వికుడు నీవే ఆచార్య  
సుదతిని సంతృప్తించే సౌంధాపత్వికుడు నీవే ఆచార్య

పరిభ్రమించి పర్యవేక్షించే పవిత్రతమైన ప్రచారకుడు ప్రజ్ఞానవంతుడు నీవే ఆచార్య   || ఆచార్యా! ||  

స్వచ్ఛమైన భావానివో శుద్ధమైన తత్త్వానివో

స్వచ్ఛమైన భావానివో శుద్ధమైన తత్త్వానివో 
సూర్యోదయమైన వేదానివో శుభోదయమైన జ్ఞానాన్నివో 

సుధాకరమైన రూపానివో శుభకరమైన జీవానివో  
సుభాషితమైన తరుణానివో శోభకృతమైన సమయానివో 

Tuesday, August 3, 2021

మరల రాదే మరో ప్రపంచం

మరల రాదే మరో ప్రపంచం 
మరల రాదే మరో ప్రశాంతం 

మరల రాదే మరో అవకాశం 
మరల రాదే మరో అనుభవం 

మరల రాదే మరో సుభాషితం 
మరల రాదే మరో సుబోధితం 

మరల రాదే మరో ఆరంభం 
మరల రాదే మరో ఆద్యంతం

మళ్ళీ మళ్ళీ తలచే సమయం సందర్భం అనుభవాల ఆనందం 
మళ్ళీ మళ్ళీ తలచే తరుణం తన్మయం ఆచరణాల అనుకరణం   || మరల || 

ఎన్నో అనుభవాలతో సాగే ప్రపంచం ఎన్నో విధాల సాగే ప్రశాంతం 
ఎన్నో ఆచరణాలతో సాగే సమయం ఎన్నో వైనాల సాగే ప్రయాణం 

ఎన్నో అద్భుతాలతో సాగే తరుణం ఎన్నో మార్గాల సాగే ప్రావీణ్యం 
ఎన్నో ఆశ్చర్యాలతో సాగే అరుణం ఎన్నో రూపాల సాగే ప్రఖ్యాతం 

మరో పరిచయాలతో సాగే విధానం మరో బంధాలతో సాగే సమైక్యం 
మరో ప్రచారణాలతో సాగే విషయం మరో చందాలతో సాగే సౌకర్యం   || మరల || 

ఎన్నో ఆశయాలతో సాగే సాధనీయం ఎన్నో భావాలతో సాగే విజయం 
ఎన్నో చరణాలతో సాగే ప్రదర్శనం ఎన్నో తత్వాలతో సాగే సాఫల్యం 

ఎన్నో కార్యాలయాలతో సాగే కార్యక్రమం ఎన్నో సంగతులతో సాగే సంచలనం
ఎన్నో శరణాలయాలతో సాగే కార్యకాలం ఎన్నో సంతతులతో సాగే ఇంచుకంతం 

మరో అభిప్రాయాలతో సాగే నిబంధనం ఎన్నో సామర్థ్యాలతో సాగే సంఘటనం 
మరో స్వతంత్రాలతో సాగే నియామకం ఎన్నో సంకల్పాలతో సాగే సంఘటితం   || మరల || 

Monday, August 2, 2021

ఆనందం పరమానందం మన ఆత్మ పరమాత్మం పరతత్వం పరమార్థం

ఆనందం పరమానందం మన ఆత్మ పరమాత్మం పరతత్వం పరమార్థం 
ఆనందం పరమానందం మన ఆత్మ పరాంగవం పరస్పరం పరాప్రకృతం  

ఆనందం పరమానందం మన ఆత్మ పరిశుద్ధం పరిశుభ్రం పరిపూర్ణం 
ఆనందం పరమానందం మన ఆత్మ పర్యావరణం పత్రహరితం పరాచలం   || ఆనందం || 

పరమాత్మలోనే నివసించు మన ఆత్మ దేహం మహా తత్వమైన జీవమే 
పరమాత్మలోనే ఉదయించు మన ఆత్మ రూపం మహా దివ్యమైన తేజమే 
 
పరమాత్మలోనే ప్రభవించు మన ఆత్మ లోకం మహా పూజ్యమైన యోగమే 
పరమాత్మలోనే ప్రయాణించు మన ఆత్మ గమ్యం మహా రాజ్యమైన భోగ్యమే

పరమాత్మలోనే ప్రస్తావించు మన ఆత్మ వేదం మహా కావ్యమైన జ్ఞానమే 
పరమాత్మలోనే విస్తారించు మన ఆత్మ త్యాగం మహా పూర్వమైన కార్యమే   || ఆనందం || 

పరమాత్మలోనే పరిశోధించు మన ఆత్మ శాస్త్రం మహా శూన్యమైన మర్మమే 
పరమాత్మలోనే సంభాషించు మన ఆత్మ శ్రావ్యం మహా సత్యమైన మంత్రమే 

పరమాత్మలోనే విశ్వసించు మన ఆత్మ గుణం మహా నిత్యమైన భావమే 
పరమాత్మలోనే ఆశ్వాసించు మన ఆత్మ కణం మహా భవ్యమైన బంధమే 

పరమాత్మలోనే ఆశ్రయించు మన ఆత్మ స్థానం మహా సర్వమైన శాంతమే 
పరమాత్మలోనే ఆత్రయించు మన ఆత్మ క్షణం మహా పర్వమైన కాంతమే   || ఆనందం ||